https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ కొత్త అప్డేట్.. ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడంటే?

బాహుబలి సిరీసుల తర్వాత దర్శక దిగ్గజం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. పాన్ వరల్డ్ లెవల్లో ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. బాహుబలి కంటే భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తుండటంతో ఈ మూవీపై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: బాలయ్యతో పెట్టుకున్న బోయపాటి.. ఇక దబిడిదిబిడేనా..? తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రిలీజ్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో రాంచరణ్ టీజర్ […]

Written By: , Updated On : October 20, 2020 / 04:53 PM IST
Follow us on

బాహుబలి సిరీసుల తర్వాత దర్శక దిగ్గజం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. పాన్ వరల్డ్ లెవల్లో ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. బాహుబలి కంటే భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తుండటంతో ఈ మూవీపై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: బాలయ్యతో పెట్టుకున్న బోయపాటి.. ఇక దబిడిదిబిడేనా..?

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రిలీజ్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో రాంచరణ్ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. యూట్యూబ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా రికార్డు సృష్టించింది. తాజాగా ‘రామరాజు ఫర్ భీమ్’ పేరిట మరో టీజర్ రాబోతుందని చిత్రబృందం అధికారికంగా ముహుర్తం ఖరారు చేసింది.

ఈనెల 22న ఉదయం 11గంటలకు ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజ్ చేయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. తెలుగు.. తమిళం.. హిందీ.. కన్నడ.. మలయాళ భాషల్లో ఒకేసారి ‘రామరాజు ఫర్ భీమ్’ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Also Read: ‘రాధేశ్యామ్’పై కాపీ మరక.. కౌంటర్ ఇవ్వరా?

‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట రాంచరణ్ టీజర్ యూట్యూబ్లో కొత్త రికార్డు సృష్టించడంతో ఎన్టీఆర్ టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ టీజర్.. చరణ్ టీజర్ ను ఎన్నిరోజుల్లో బీట్ చేస్తుందా? అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. ఈ మూవీకి కీరవాణి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండగా బాలీవుడ్ భామ అలియాభట్.. హాలీవుడ్ బామ ఓలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.