https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ బ్రేకింగ్: లీకైన కథ.. ఇదే?

దర్శకధీరుడు రాజమౌళి అంటేనే ప్రేక్షకులు ఎగబడుతుంటారు. ఆయన కథ, కథనం అలా స్క్రీన్ పై అద్భుతాలు సృష్టిస్తుంది. జక్కన్న సినిమా చెక్కాక ఇక తిరుగుండదు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రాజమౌళి దర్శకత్వం.. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథ కలిస్తే ఇక బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టినట్టే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కథ మరోసారి లీక్ అయ్యింది. ఇదేనంటూ ప్రచారం సాగుతోంది. Also Read: అమీర్ ఖాన్, మహేష్.. ఇద్దరు స్టార్ లను […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 05:09 PM IST
    Follow us on

    దర్శకధీరుడు రాజమౌళి అంటేనే ప్రేక్షకులు ఎగబడుతుంటారు. ఆయన కథ, కథనం అలా స్క్రీన్ పై అద్భుతాలు సృష్టిస్తుంది. జక్కన్న సినిమా చెక్కాక ఇక తిరుగుండదు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రాజమౌళి దర్శకత్వం.. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథ కలిస్తే ఇక బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టినట్టే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కథ మరోసారి లీక్ అయ్యింది. ఇదేనంటూ ప్రచారం సాగుతోంది.

    Also Read: అమీర్ ఖాన్, మహేష్.. ఇద్దరు స్టార్ లను కలుపబోతున్న రాజమౌళి?

    లీక్ దాన్ని బట్టి కథ ఇదేనని ప్రచారం సాగుతోంది. ‘బ్రిటీష్ వాళ్ల తరుఫున పోలీస్ గా రాంచరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజు గా పనిచేస్తుంటాడట.. మాస్ లీడర్ అయిన గిరిజన నాయకుడు భీమ్ ను అరెస్ట్ చేస్తాడట.. ఆ తర్వాత బ్రీటీషర్లపై ఎదురు తిరిగే క్రమంలో ఓ సీన్ లో ఇద్దరు కలిసిపోతారు. శత్రువులు కాస్త మిత్రులవుతారట.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే క్రమంలోనే ఇద్దరు కలుస్తారట.. భీమ్ బ్రిటీషర్లపై గొరిల్లా దాడులతో ఏరివేస్తుంటాడట..

    అల్లూరి, కొమురం భీం పాత్రలను రాజమౌళి బాగా డిజైన్ చేశాడని.. భీమ్ పాత్ర పులితో పోరాటం అద్భుతంగా తెరపై వస్తుందని టాక్ ఉంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కథ నిజమా? అబద్ధమా అన్నది తేలాల్సి ఉంది.

    Also Read: ‘ఆదిపురుష్’: రామాయణాన్ని టచ్ చేస్తే మతవివాదాలు తప్పవా?

    అయితే తాజాగా విడుదలైన ట్రైలర్లను బట్టి కథ అల్లారని ఇది అసలు కథ కాదు అనే వారు కూడా ఉన్నారు. మరి ఆర్ఆర్ఆర్ విడుదలైతే కానీ అసలు కథ ఏంటనేది తెలియదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్