‘దుర్గమతి’ రాబోతుంది.. మరి అలరిస్తోందా ?

స్వీటీ అనుష్క మెయిన్ రోల్ లో వచ్చిన ‘భాగమతి’ బాలీవుడ్ లో “దుర్గమతి”గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు.. దుర్గావతి. ఐతే “పద్మావతి” సినిమా విషయంలో జరిగిన రగడ చూసి, ఇప్పుడు “దుర్గమతి” అని ఈ సినిమా టైటిల్ ను మార్చారు. తెలుగులో అనుష్క నటించిన ఈ సినిమా సప్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ రేంజ్ […]

Written By: admin, Updated On : November 24, 2020 5:25 pm
Follow us on


స్వీటీ అనుష్క మెయిన్ రోల్ లో వచ్చిన ‘భాగమతి’ బాలీవుడ్ లో “దుర్గమతి”గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు.. దుర్గావతి. ఐతే “పద్మావతి” సినిమా విషయంలో జరిగిన రగడ చూసి, ఇప్పుడు “దుర్గమతి” అని ఈ సినిమా టైటిల్ ను మార్చారు. తెలుగులో అనుష్క నటించిన ఈ సినిమా సప్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ రేంజ్ లో భయపెట్టింది. మొత్తానికి హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

Also Read: నెంబర్ వన్ స్టార్ గా అవతరించిన సొనూసుద్..!

కాగా దర్శకుడు అశోక్ ఈ సినిమాని ఓ భిన్నమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్ జోనర్లో చాల బాగా తెరకెక్కించారు. కాగా ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 11న విడుదల కానుంది. కాగా విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోకే దర్శకత్వం వహిస్తున్నారు. మరి అనుష్క ‘భాగమతి’ ‘దుర్గామతి’గా హిందీ ప్రేక్షకులను అలరిస్తోందా..? ఇప్పటికే సినిమా ఫస్ట్ కాపీ చూసిన కొంతమందికి సినిమా బాగా నచ్చిందట.

Also Read: ‘ఆదిపురుష్’: రామాయణాన్ని టచ్ చేస్తే మతవివాదాలు తప్పవా?

ఎంతైనా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో అక్షయ్ ముందునుంచీ చాల జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటాడు. అందుకే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ కూడా అందుకే భారీ మొత్తాన్ని ఇచ్చి ఈ సినిమాని కొనుక్కుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్