https://oktelugu.com/

‘ఆదిపురుష్’: రామాయణాన్ని టచ్ చేస్తే మతవివాదాలు తప్పవా? 

రామాయణం అనేది హిందువుల మతవిశ్వాసానికి ప్రతీక. ఒకప్పుడు రామాయణంపై సినిమాలు తీస్తే ప్రేక్షకులతోపాటు హిందుత్వవాదులు ఆదరించేవారు. కానీ ఇటీవలీ కాలంలో ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీస్తే మాత్రం నానాయాగీ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తుల బయోగ్రఫీ.. కులాలు.. మతాలను టచ్ చేసి సినిమా తీస్తే మాత్రం కొందరు వివాదాలు సృష్టించడానికి రెడీ ఉంటున్నారు. Also Read: ఆర్ఆర్ఆర్ బ్రేకింగ్: లీకైన కథ.. ఇదే? ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’లో దర్శకుడు రాజమౌళి కొమురంభీం పాత్రలో ఓ వర్గానికి చెందిన టోపీతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 04:48 PM IST
    Follow us on

    రామాయణం అనేది హిందువుల మతవిశ్వాసానికి ప్రతీక. ఒకప్పుడు రామాయణంపై సినిమాలు తీస్తే ప్రేక్షకులతోపాటు హిందుత్వవాదులు ఆదరించేవారు. కానీ ఇటీవలీ కాలంలో ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీస్తే మాత్రం నానాయాగీ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తుల బయోగ్రఫీ.. కులాలు.. మతాలను టచ్ చేసి సినిమా తీస్తే మాత్రం కొందరు వివాదాలు సృష్టించడానికి రెడీ ఉంటున్నారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ బ్రేకింగ్: లీకైన కథ.. ఇదే?

    ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’లో దర్శకుడు రాజమౌళి కొమురంభీం పాత్రలో ఓ వర్గానికి చెందిన టోపీతో చూపించడం తీవ్ర దూమారం రేపింది. ఇందులో కొమురంభీం మద్దతుదారులతోపాటు రాజకీయ నాయకులు కలుగజేసుకొని రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. సినిమా నుంచి ఆ సీన్ తీసివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సినిమాను థియేటర్లలోనే తగులబెడుతామంటూ కొందరు హెచ్చరికలు జారీ చేశారు.

    సినిమాలో ఏం ఉందో తెలియకుండా కొందరు సినిమాలపై నానా రచ్చ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇదంతా పబ్లిసీటీ స్టాంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే రామాయణ ఇతిహాసాన్ని టచ్ చేస్తూ కొందరు దర్శకులు సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. దర్శకులు ఏమాత్రం రామాయణాన్ని అటూ ఇటూగా చూపించిన వివాదాలు చెలరేగడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: అమీర్ ఖాన్, మహేష్.. ఇద్దరు స్టార్ లను కలుపబోతున్న రాజమౌళి?

    రామాయణం ఆధారంగానే లంకకు త్రేతాయుగానికి లింక్ చేస్తూ దర్శకుడు అభిషేక్ శర్మ ‘రామసేతు’ పేరుతో ఓ సినిమాను తెరక్కిస్తున్నాడు. ఇందులో అక్షయ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే ‘ఓం’ పేరుతో ఆదిత్య కపూర్ హీరోగా ఓ మూవీ రాబోతుండగా టైటిల్లోనే మతం ఉందంటూ వివాదం నెలకొంది. ఇలాంటి టైములోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ ‘ఆదిపురుష్’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు.

    ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా లంకేయుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ విషయంలో దర్శకుడు ఏమాత్రం చిన్నపొరపాటు చేసిన ఓ వర్గం మతం ముసుగులో గొడవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియాలో కొన్ని కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణం.. రామసేతు వంటి అంశాలను సినిమాగా తెరకెక్కించడం దర్శకులకు కత్తిమీద సాములాగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్