
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరుగుతున్న జరుగుతున్న డేనైట్ టెస్ట్ రసకందాయంలో పడింది. టీమిండియా రెండో రోజు 99/3తో ఇన్నింగ్స్ కొనసాగించి ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. కెప్టెన్ రూట్ 5 వికెట్లతో చెలరేగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జాక్ లీచ్ 4, రూట్ 5 వికెట్లతో విజృంభించాడు. కేవలం రెండు గంటల్లోనే టీమిండియాను ఆలౌట్ చేశారు. టీమిండియా ఆధిక్యం 33కే పరిమితం చేశారు. అంతకుముందు ఇంగ్లండ్ 112 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఇక భారత్ ను తక్కువకే ఆలౌట్ చేసిన ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఇంగ్లండ్ కూడా తడబడింది. ఇన్నింగ్స్ ప్రారంభించి ఒక్క పరుగు కూడా చేయకముందే వరుసగా ఓపెనర్ క్రాలే తోపాటు బెయిర్ స్టో వికెట్ ను కోల్పోయింది. సున్నా పరుగులకే రెండు వికెట్లను తొలి ఓవర్ లో కోల్పోయిన ఇంగ్లండ్ కు గట్టి దెబ్బ తగిలింది. తర్వాత కెప్టెన్ రూట్, స్టోక్స్ మరో వికెట్ పడకుండా పోరాడుతున్నారు. ప్రస్తుతం 50 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ ఎదురు ఈదుతోంది.
టీమిండియా బౌలర్లు సాధించిన ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. స్పిన్ ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. కేవలం 33 పరుగులే ఎక్కువ చేశారు. రెండో రోజు పూర్తిగా ఆడి ఉంటే ఈ టెస్టులో ఇండియా ఆధిక్యతలో ఉండేది.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను ఎంత తక్కువకే ఆలౌట్ చేస్తామనే దానిపైనే భారత విజయం ఆధారపడి ఉంది. కనీసం మరో 100 పరుగుల ఆధిక్యం ఉంటే ఇంగ్లండ్ ఓటమి తథ్యమయ్యేది. ఇప్పుడు రెండో రోజు ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.
W, 0, W! 👌👌@akshar2026 narrowly misses out on a hat-trick but what a start this has been for the local boy! 👍👍@Paytm #INDvENG #TeamIndia #PinkBallTest
Follow the match 👉 https://t.co/9HjQB6TZyX pic.twitter.com/00HrgvVyzv
— BCCI (@BCCI) February 25, 2021
Comments are closed.