https://oktelugu.com/

రివ్యూ: ‘ఆకాశం నీ హద్దురా’ హిట్టా? ఫ్లాపా?

తెలుగు, తమిళంలో హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సూర్య సరసన అపర్ణ బాలమురళీ తనదైన ఫార్మెమెన్స్ తో ఆకట్టుకుంది. కెప్టెన్ గోపీనాథ్ జీవితాధరంగా చేసుకొని దర్శకురాలు సుధ కొంగర సినిమాను అద్భుతంగా తెరకెక్కించింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం..! Also Read: మహేష్ బాబు ఎంజాయ్.. మామూలుగా లేదుగా..! ఇటీవలీ కాలంలో బయోపిక్ సినిమాల హవా నడుస్తుంది. ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తుండటంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 10:22 AM IST
    Follow us on

    తెలుగు, తమిళంలో హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సూర్య సరసన అపర్ణ బాలమురళీ తనదైన ఫార్మెమెన్స్ తో ఆకట్టుకుంది. కెప్టెన్ గోపీనాథ్ జీవితాధరంగా చేసుకొని దర్శకురాలు సుధ కొంగర సినిమాను అద్భుతంగా తెరకెక్కించింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం..!

    Also Read: మహేష్ బాబు ఎంజాయ్.. మామూలుగా లేదుగా..!

    ఇటీవలీ కాలంలో బయోపిక్ సినిమాల హవా నడుస్తుంది. ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తుండటంతో దర్శక, నిర్మాతలు బయోపిక్ లను తెరకెక్కించేందుకు ఏమాత్రం వెనుకడటం లేదు. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఎయిర్ డెక్కర్ సంస్థను నెలకొల్పిన కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ కావడం విశేషం. సింప్లీ ఫై అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.

    కథ విషయానికొస్తే 2003లో విమానం ల్యాండింగ్ కోసం ఓ పైలట్ ప్రయత్నించగా ఏవియేషన్ అధికారులు అంగీకరించరు. అసలు వారు ఎందుకు అంగీకరించలేదు. చంద్రమహేష్(సూర్య) అధికారులతో గొడవపడి ఎందుకు ల్యాండ్ చేయించారు. అతడికి విమానానికి లింకేంటీ? విమానంలో మహా భార్య సుందరి(అపర్ణ బాలమురళీ).. పరశ్ గోస్వామి( పరేశ్ రావల్), భక్తవత్సలం నాయుడు(మోహన్)ల పాత్రలను ఆద్యంతం ఆకట్టుకునేలా చూపించారు.

    Also Read: అయ్యా బాబోయ్.. స్టైలీష్ స్టార్ ఇలా అయ్యాడెంటీ.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?

    ఓ పల్లెటూరుకు చెందిన గోపీనాథ్ విమాన సంస్థను ఎలా స్థాపించారనేది కమర్షియల్ హంగులతో దర్శకురాలు సుధ వంగర చాలా బాగా చూపించారు. ఈక్రమంలో సినిమా నిడివి కొంచెం పెద్దగా అనిపించింది. అయితే సినిమా ఎక్కడ బోరుకొట్టకుండా చూసుకున్నారు. విమాన సంస్థ ఏర్పాటు కోసం హీరో పడ్డ కష్టాలు.. అధిగమించిన విధానాన్ని దర్శకురాలు సుధ వంగర ఆకట్టుకునేలా చూపించారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సూర్య.. అపర్ణ నటన.. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ డబ్బింగ్ సినిమా కావడంతో తెలుగు నెటివేటి మిస్ అయింది. మొత్తానికి సినిమా మాత్రం విజేత ప్రయాణంలా ముందుకు సాగింది. ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజైన పెద్ద సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకోగా ‘ఆకాశం నీ హద్దురా’ ఆ సెంటిమెంట్ ను క్రాస్ చేసినట్లు కన్పిస్తోంది.