టీపీసీసీ రేసులో వెనుకబడ్డ రేవంత్.. కారణమెంటీ?

కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీని మార్చాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. హూజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీపీసీసీ మార్పుపై కాంగ్రెస్ లో పెద్దఎత్తున చర్చ నడిచింది. అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చేయలేదు. Also Read: వరదసాయం పాతవారికేనా? కొత్త దరఖాస్తులపై క్లారిటీ ఏది? తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఫలితాల్లో కాంగ్రెస్ దారుణ ఓటమిని చవిచూసింది. ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ […]

Written By: Neelambaram, Updated On : December 10, 2020 1:43 pm
Follow us on

కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీని మార్చాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. హూజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీపీసీసీ మార్పుపై కాంగ్రెస్ లో పెద్దఎత్తున చర్చ నడిచింది. అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చేయలేదు.

Also Read: వరదసాయం పాతవారికేనా? కొత్త దరఖాస్తులపై క్లారిటీ ఏది?

తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఫలితాల్లో కాంగ్రెస్ దారుణ ఓటమిని చవిచూసింది. ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ ఫలితాలకు బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా చేశాడు. దీంతో డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కొత్త టీపీసీసీ ప్రకటన వస్తుందని అందరూ భావించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవీ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అయితే కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు మాత్రం రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు టీపీసీసీ ఇవ్వొద్దని.. కాంగ్రెస్ లోని సీనియర్ నేతకే టీపీసీసీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

టీపీసీసీ రేసులో తొలి నుంచి రేవంత్ రెడ్డి పేరు ముందంజలో ఉంది. ప్రతీ విషయంలోనూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను ఢీకొడుతుండటంతో అతడికి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో అతడినే టీపీసీసీ చేయాలని అధిష్టానం భావించింది. అయితే కాంగ్రెస్ సీనియర్లు మాత్రం అతడికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

Also Read: చిత్రపురిలో కొనసాగుతున్న ఎన్నికలు.. సాయంత్రం ఫలితాల వెల్లడి..!

ఈక్రమంలోనే టీపీసీసీ రేసులో నల్లొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీధర్ బాబు.. వీహెచ్ హన్మంతు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో కోమటిరెడ్డికి సీనియర్ల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా కోమటిరెడ్డి కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంతో ఆయకే పీసీసీ పదవీ దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ నేతలు పీసీసీ కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తుండటంతో అధిష్టానం సైతం కింది స్థాయిలో అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణికం ఠాకూర్ హైదరాబాద్లో మకాం వేసి జిల్లా స్థాయి నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. వీటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత టీపీసీసీపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు ఉండటంతో కోమటిరెడ్డికే టీపీసీసీ దక్కే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్