https://oktelugu.com/

చిత్రపురిలో కొనసాగుతున్న ఎన్నికలు.. సాయంత్రం ఫలితాల వెల్లడి..!

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ మొదలుకాగా.. మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. వీటిలో ఇప్పటికే అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానెల్ తోపాటు సి.కల్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’.. ఓ.కళ్యాణ్ ప్యానెల్.. కొమర వెంకటేశ్ ప్యానెల్ ఉన్నాయి. Also Read: వరదసాయం పాతవారికేనా? కొత్త దరఖాస్తులపై క్లారిటీ ఏది? చిత్రపురి కాలనీలో మొత్తం 4,803 ఓట్లు ఉన్నాయని ఎన్నికల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2020 / 12:29 PM IST
    Follow us on

    చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ మొదలుకాగా.. మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. వీటిలో ఇప్పటికే అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానెల్ తోపాటు సి.కల్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’.. ఓ.కళ్యాణ్ ప్యానెల్.. కొమర వెంకటేశ్ ప్యానెల్ ఉన్నాయి.

    Also Read: వరదసాయం పాతవారికేనా? కొత్త దరఖాస్తులపై క్లారిటీ ఏది?

    చిత్రపురి కాలనీలో మొత్తం 4,803 ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారి అరుణ తెలిపారు. ఇప్పటికే దాదాపు వెయ్యి ఓట్లకు పైగా పోలైనట్లు తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రస్తుతానికి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వీ.వీ.వినాయక్ తన ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకున్నారు.

    ఇదిలా ఉంటే ఓ.కల్యాణ్‌ ఇటీవల తన ప్యానెల్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన కామెంట్స్ చేశారు. గడిచిన ముప్పై ఐదేళ్లుగా సినీ పరిశ్రమలోనే ఉన్నానని తెలిపారు. అలాగే పలు అసోసియేషన్స్‌లో పనిచేశానని.. ప్రతీచోట అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే వచ్చానిని తెలిపారు.

    Also Read: ఏమ్మా రేవతి.. అధికారం ‘చేతి’లో ఉంటే లాగిపెట్టి కొట్టొచ్చా?

    తమ్మారెడ్డి భరద్వాజ.. పరుచూరి వెంకటేశ్వరరావు.. వినోద్‌బాలతోపాటు 11మందితో కూడిన కమిటీ చిత్రపురిలో అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఓ.కల్యాణ్ ప్యానల్ ఆరోపించారు. దీంతో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో చిత్రపురి ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనే ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 3గంటల వరకు పొలింగ్ ముగియనుండటంతో సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్