
ఏపీ ప్రభుత్వం పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Also Read: పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబే.. సజ్జల సంచలన ప్రకటన
అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు తెలిపారు.
కరోనా కారణంగా చదువులు ఏడాదిగా సాగలేదు. విద్యార్థుల చదువులు ముందుకు సాగలేదు. వారందరినీ గాడిలో పెట్టేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. దశల వారీగా తరగతులు మొదలుపెట్టారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని పాఠశాలలు యథాతథంగా పనిచేస్తున్నాయన్నారు. జూన్ 5 వరకు తరగతులు కొనసాగుతాయని వివరించారు.
Also Read: పంచాయతీ ఎన్నికల్లో నోట్ల హవా: అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
మే 3 నుంచి 15 వరకు 1-9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులై 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆదిమూలపు సురేష్ చెప్పారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
