ఏపీలో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దారుణమైన దాడి ఇటీవల విజయవాడలో జరిగింది. పట్టాభి కారులో వెళుతుండగా కొందరు దుండగులు ఆయన పై దాడి చేశారు. కారు అద్దాలు పగులకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. చంద్రబాబు వెళ్లి పరామర్శించి వైసీపీనే ఈ దాడి చేయించిందని ఆరోపించాడు.
Also Read: పంచాయతీ ఎన్నికల్లో నోట్ల హవా: అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
అయితే తాజాగా ఈ దాడి ఘటనపై సంచలన నిజాలు చెప్పాడు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి మీద దాడి చేయించింది చంద్రబాబే అని సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడి ఘటన ఉట్టి ఎలక్షన్ స్టంట్ కూడా అయ్యి ఉండొచ్చని అన్నారు. పట్టాభి అంత పెద్ద నాయకుడు ఏం కాదని.. ఆయనకంత స్థాయి లేదని.. అలాంటి వ్యక్తుల మీద దాడి చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని సజ్జల ప్రశ్నించాడు.
ఏది ఏమైనా ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనన్నారు సజ్జల. పూర్వం పట్టాభికి ఎలాంటి గొడవలు ఉన్నాయో తెలియదని.. అప్పట్లో కూడా ఎవరూ రాయితో ఆయనను కొట్టారని అంటున్నారని సజ్జల అన్నాడు. పట్టాభిపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని సజ్జల అన్నారు. భౌతిక దాడి చేయడం అరాచకమన్నారు.
భౌతిక దాడులు చేయడానికి ఇది టీడీపీ, చంద్రబాబు పాలన కాదని.. వైఎస్ జగన్, వైసీపీ పాలన అని సజ్జల అన్నారు. ఇక్కడ ఎవరిమీదనైనా ప్రజాస్వామ్యబద్దంగా తాము తేల్చుకుంటామన్నారు.
Also Read: షాకింగ్: అచ్చెన్నాయుడును అరెస్టు చేయించింది నిమ్మగడ్డనేనా?
పట్టాభి ఈ మధ్య కాలంలో టీడీపీ తరుఫున మీడియా చానెల్స్ లో పెద్ద పెద్ధ నోరు వేసుకొని వైసీపీపై విరుచుకుపడుతుంటారు. విజయవాడలో ఎవరో దుండగులు దాడులు చేశారు. దాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకొని రచ్చ చేశారు.
చంద్రబాబు తీరు చూస్తుంటే తనకు ఎక్కడో చిన్న అనుమానం కలుగుతోందని.. పట్టాభిపై దాడిని ఇంత రచ్చ చేసిన చంద్రబాబు తీరు చూస్తే ఇది చంద్రబాబు చేయించిందే అనిపిస్తోందని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్