డ్వాక్రా గ్రూపులకు అదిరిపోయే శుభవార్త.. రూ.20 లక్షల రుణం..?

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్వాక్రా గ్రూపులకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్వయం సహాయక బృందాలకు ఊరట కలిగే విధంగా కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇకపై డ్వాక్రా గ్రూపులు ఎలాంటి తనఖాలు లేకుండానే గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డ్వాక్రా గ్రూపులకు భారీగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. గతంలో ఈ లిమిట్ 10 లక్షల రూపాయలుగా ఉండగా ఆర్బీఐ తాజాగా లిమిట్ ను పెంచింది. […]

Written By: Kusuma Aggunna, Updated On : August 12, 2021 11:04 am
Follow us on

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్వాక్రా గ్రూపులకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్వయం సహాయక బృందాలకు ఊరట కలిగే విధంగా కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇకపై డ్వాక్రా గ్రూపులు ఎలాంటి తనఖాలు లేకుండానే గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డ్వాక్రా గ్రూపులకు భారీగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

గతంలో ఈ లిమిట్ 10 లక్షల రూపాయలుగా ఉండగా ఆర్బీఐ తాజాగా లిమిట్ ను పెంచింది. ఆర్బీఐ దీన్‌దయాల్ అంత్యోదయ యోజన‌- నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌ లో భాగంగా ఈ ప్రయోజనాన్ని అందిస్తుండటం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలలో దీన్‌దయాల్ అంత్యోదయ యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ ను పేదరికంను నిర్మూలించడానికి కేంద్రం అమలు చేస్తోంది.

కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడానికి ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎలాంటి డిపాజిట్లను తీసుకోకుండానే బ్యాంకులు స్వయం సహాయక సంఘాలకు రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది.

బ్యాంకులు మహిళల సేవింగ్స్ ఖాతాల విషయంలో ఆంక్షలు విధిస్తూ ఎలాంటి నిబంధనలను అమలు చేయకూడదు. బ్యాంకులు లోన్ ను మంజూరు చేసే సమయంలో మార్జిన్ ను కూడా తీసుకోకూడదు. ఆర్బీఐ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.