రాయపాటి మోసం: పనిమనిషి, స్వీపర్లు, డ్రైవర్లే డైరెక్టర్లు?

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ మోసంగా టిడిపి మాజీ ఎంపి రాయపాటి సాంబశివ రావు యాజమాన్యంలోని హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన చీటింగ్ ఖ్యాతి గాంచింది. ఏకంగా 7,296 కోట్ల రూపాయల విలువైన మొత్తాన్ని బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన పారిశ్రామికవేత్త ‘నీరవ్ మోడీ’ని రాయపాటి ఓవర్ టేక్ చేసేశాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు విమర్శిస్తున్నారు. Also Read: రజనీ కాంత్ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం కానుందా? ఇటీవలే రాయపాటి […]

Written By: NARESH, Updated On : December 22, 2020 5:51 pm
Follow us on

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ మోసంగా టిడిపి మాజీ ఎంపి రాయపాటి సాంబశివ రావు యాజమాన్యంలోని హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన చీటింగ్ ఖ్యాతి గాంచింది. ఏకంగా 7,296 కోట్ల రూపాయల విలువైన మొత్తాన్ని బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన పారిశ్రామికవేత్త ‘నీరవ్ మోడీ’ని రాయపాటి ఓవర్ టేక్ చేసేశాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు విమర్శిస్తున్నారు.

Also Read: రజనీ కాంత్ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం కానుందా?

ఇటీవలే రాయపాటి కంపెనీ, డైరెక్టర్లపై దాడులు చేసిన సీబీఐ సంచలన విషయాలను బయటపెట్టింది. రాయపాటి పనిమనిషి, స్వీపర్లు, డ్రైవర్ల పేరిట కల్పిత సంస్థలను సృష్టించి వేల కోట్లు మోసం చేశారని సీబీఐ గుర్తించింది. నిధులను మళ్లించడానికి డ్రైవర్లను డైరెక్టర్లుగా చేశారనే విషయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది.

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అనుబంధం పనిమనుషులు, స్వీపర్లు, డ్రైవర్ల పేర్లతో పద్మావతి ఎంటర్ప్రైజెస్, యూనిక్ ఇంజనీర్స్, బాలాజీ ఎంటర్ప్రైజెస్, రుత్విక్ అసోసియేట్స్ రూ .6,643 కోట్లు మోసం చేశాయని సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది.

Also Read: టీడీపీ రెచ్చగొట్టే రాజకీయాలు.. ఉచ్చులో పడని వైసీపీ

” ప్రస్తుతం లేని తొమ్మిది కంపెనీలు, ఉద్యోగుల సహాయంతో మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడానికి కంపెనీలు పనివాళ్లతో సృష్టించబడ్డాయి” అని సిబిఐ ఆరోపించింది. దీంతో రాయపాటి భారీ మోసం బయటపడింది. ఇదిప్పుడు తెలుగునాట సంచలనమైంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్