https://oktelugu.com/

సొంత నియోజకవర్గంపై జగన్‌ ప్రేమ

ఏ నేతకైనా.. ఏ స్థాయిలో ఉన్న లీడర్‌‌ కైనా తన సొంత జిల్లా.. సొంత నియోజకవర్గంపై ఉండే ప్రేమ అంతా ఇంతా కాదు. ఏ నేతకైనా ఆ పక్షపాతం తప్పనిసరిగా ఉంటుంది. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి కూడా తన సొంత నియోజకవర్గం పులివెందులపై మమకారం ఎక్కువ. అందుకే.. వీలు దొరికినప్పుడల్లా వందల కోట్ల రూపాయలను ఆ నియోజకవర్గానికి విడుదల చేస్తూనే ఉంటారు. Also Read: న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 22, 2020 11:56 am
    Follow us on

    CM Jagan
    ఏ నేతకైనా.. ఏ స్థాయిలో ఉన్న లీడర్‌‌ కైనా తన సొంత జిల్లా.. సొంత నియోజకవర్గంపై ఉండే ప్రేమ అంతా ఇంతా కాదు. ఏ నేతకైనా ఆ పక్షపాతం తప్పనిసరిగా ఉంటుంది. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి కూడా తన సొంత నియోజకవర్గం పులివెందులపై మమకారం ఎక్కువ. అందుకే.. వీలు దొరికినప్పుడల్లా వందల కోట్ల రూపాయలను ఆ నియోజకవర్గానికి విడుదల చేస్తూనే ఉంటారు.

    Also Read: న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ హాట్ కామెంట్స్

    రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కడ కూడా రోడ్లకు రిపేరు చేయించేందుకు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. కానీ.. తాజాగా క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు సొంత నియోజకవర్గానికి వెళ్తున్న సీఎం కోసం రూ. 633 కోట్లను పులివెందులకు విడుదల చేశారు. వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ఈ మేరకు జీవోలు ఇచ్చారు. గతేడాది అంటే డిసెంబర్ 23న క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు జగన్ పులివెందుకు వెళ్తున్న సమయంలోనూ పెద్ద ఎత్తున జీవోలు విడుదల చేశారు. దాదాపుగా 30 వరకూ జీవోలు ఇచ్చారు.

    అప్పుడు కడప మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కోసం రూ.125 కోట్లు, 100 పడకల మెంటల్ హాస్పిటల్ కోసం రూ.40.82 కోట్లు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం రూ.347 కోట్లు, 100 పడకల కేన్సర్ హాస్పిటల్ జీవో, కడపలో బ్యూటీఫికేషన్ కోసం రూ.55 కోట్లు, పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.63 కోట్లు, పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రూ.17.5 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కొన్ని మాత్రమే. ఇంకా రహస్య జీవోలు కొన్ని ఇతర పనుల జీవోలు కూడా ఉన్నాయి. ఈ పనుల మొత్తం విలువ 1300 కోట్లు.

    Also Read: వైసీపీపై పోలీసుల స్వామి భక్తి సల్లగుండా?

    తర్వాత జనవరిలో పులివెందుల ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ.480 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ నెలాఖరులో పులివెందుల నియోజకవర్గంపై ప్రత్యేకంగా సమీక్ష చేసిన జగన్ కనీసం రూ. 300 కోట్లకుపైగా విలువైన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు.. పులివెందుల మున్సిపాలిటీకి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ.50 కోట్లు.. పులివెందులలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ బిల్డింగ్.. రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే పులివెందులలో అడుగడుగునా జగన్ అభివృద్ధి కనిపించేలా పనులు మంజూరు చేశారు.

    వీటితోపాటు.. పులివెందులలో మెట్రో స్థాయిలో మినీ శిల్పారామం, ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్కూట్‌.. జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థ ఏర్పాటు.. అలాగే.. భారీ మాల్ మల్టీప్లెక్స్‌లను పులివెందులలో నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఇవన్నీ 18 నెలల కాలంలో ఒక్క పులివెందుల కోసమే జగన్ ఆదేశించిన అభివృద్ధి కార్యక్రమాలు. అయితే పనులు మాత్రం ఎన్ని జరుగుతున్నాయనే దాని మీద ప్రచారం చేయడం లేదు. అక్కడ జరుగుతున్న పనులను చూపిస్తే ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు డిమాండ్లు చేస్తారని భావిస్తున్నారేమో కాబోలు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్