కేసీఆర్‌‌ నోట ఉద్యోగాల మాట.. అంతా ఉత్తిదేనా..!

వరుస ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్‌‌ఎస్‌ సర్కార్‌‌.. ఆ వెంటనే ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఏకంగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించేశారు. గత కొన్నేండ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు లేక తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కాచుకు చూస్తున్నారు. నియామకాల కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఉద్యోగాలు రాకపోవడంపై ఎంతో ఆవేశంలో ఉండిపోయారు. అయితే.. కేసీఆర్‌‌ తాజాగా ఇచ్చిన ఉద్యోగాల హామీని కూడా యువత నమ్మడం లేదట. ఎందుకంటే.. ఇలాంటి హామీలనే కేసీఆర్‌‌ […]

Written By: Srinivas, Updated On : December 22, 2020 12:05 pm
Follow us on


వరుస ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్‌‌ఎస్‌ సర్కార్‌‌.. ఆ వెంటనే ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఏకంగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించేశారు. గత కొన్నేండ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు లేక తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కాచుకు చూస్తున్నారు. నియామకాల కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఉద్యోగాలు రాకపోవడంపై ఎంతో ఆవేశంలో ఉండిపోయారు. అయితే.. కేసీఆర్‌‌ తాజాగా ఇచ్చిన ఉద్యోగాల హామీని కూడా యువత నమ్మడం లేదట. ఎందుకంటే.. ఇలాంటి హామీలనే కేసీఆర్‌‌ గతంలో చాలాసార్లు ఇచ్చారు.

Also Read: కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్.. తెలంగాణ అలర్ట్..!

గతంలో ఎన్నో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా వివిధ సమస్యలతో న్యాయస్థానాల్లో పిటిషన్లు పడేలా లోపాలతో నోటిఫికేషన్ ఇచ్చారని యువత భావిస్తోంది. అందుకే.. కేసీఆర్‌‌ను ఇప్పుడు ఎవరూ నమ్మే స్థితిలో లేరని అర్థమవుతోంది. అలా కోర్టుల్లో పడిన తర్వాత ప్రభుత్వం కూడా సైలెంట్‌ అయింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఉద్యోగ నోటిఫికేషన్లు అని.. అవి అయిపోయిన తర్వాత సైలెంటవుతారని అనుమానిస్తున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఎన్నో సవాళ్లు ముందున్నాయి. జోనల్‌ విధానం ఇందుకు ప్రధాన సమస్య. 31 జిల్లాల స్థానికతతో కూడిన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటివరకూ పోస్టులను పునర్విభజించలేదు. కొత్త జోనల్‌ విధానం ప్రకారం.. మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టులేవో టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఇప్పటికే 3 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపినా.. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.

Also Read: నాగార్జునసాగర్‌‌ను టార్గెట్‌ చేసిన కాంగ్రెస్

రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. 2018లో ఓ సారి నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో జిల్లాలు విభజించి.. కొత్త జోనల్ విధానాన్ని తెచ్చారు. అయితే ఏ పోస్టు.. ఏ జోన్ కిందకు వస్తుందో ప్రభుత్వం చెప్పలేదు. అలా వాయిదా పడుతూ వస్తున్నాయి. ముందు ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఈ సమస్య అంత తేలిగ్గా పరిష్కారమయ్యేది కాదని నిరుద్యోగులు అంటున్నారు. మొత్తం జోనల్ నోటిఫై చేసిన తర్వాత రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి.. రాష్ట్రపతికి పంపారు. కానీ ఆమోదముద్రపడలేదు. అది కూడా వివాదంలోనే ఉంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోతే.. నిరుద్యోగుల్లో ఉన్న ఆగ్రహం మరింత పెరిగే ప్రమాదమే ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్