బాక్సాఫీస్ వేటలో ఆ ముగ్గురు.. డిజాస్ట‌ర్ కూడా చిన్న ప‌ద‌మే..!

గ‌త వారం మూడు చిత్రాలు బాక్సాఫీస్ బ‌రిలో నిలిచాయి. శుక్ర‌వారం ‘రంగ్ దే’, ‘అర‌ణ్య’ చిత్రాలు రిలీజ్ కాగా.. ‘తెల్ల‌వారితే గురువారం’ అనే సినిమా శ‌నివారం విడుద‌లైంది. ఈ మూడు చిత్రాల్లో నితిన్ రంగ్ దే మాత్ర‌మే మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. అర‌ణ్య చిత్రంలో రానా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కిన‌ప్ప‌టికీ.. టిక్కెట్లు మాత్రం తెగ‌డం లేదు. ఇక‌, ‘తెల్ల‌వారితే గురువారం’ సినిమా దారుణంగా విఫలమైంది. రంగ్ దే సినిమా ఆదివారం నాటికి రెండు రాష్ట్రాల్లో కలిపి 10.35 […]

Written By: Bhaskar, Updated On : March 30, 2021 1:08 pm
Follow us on


గ‌త వారం మూడు చిత్రాలు బాక్సాఫీస్ బ‌రిలో నిలిచాయి. శుక్ర‌వారం ‘రంగ్ దే’, ‘అర‌ణ్య’ చిత్రాలు రిలీజ్ కాగా.. ‘తెల్ల‌వారితే గురువారం’ అనే సినిమా శ‌నివారం విడుద‌లైంది. ఈ మూడు చిత్రాల్లో నితిన్ రంగ్ దే మాత్ర‌మే మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. అర‌ణ్య చిత్రంలో రానా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కిన‌ప్ప‌టికీ.. టిక్కెట్లు మాత్రం తెగ‌డం లేదు. ఇక‌, ‘తెల్ల‌వారితే గురువారం’ సినిమా దారుణంగా విఫలమైంది.

రంగ్ దే సినిమా ఆదివారం నాటికి రెండు రాష్ట్రాల్లో కలిపి 10.35 కోటల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా చూస్తే.. దాదాపుగా రూ.13 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధించాలంటే ఇంకా రూ.11 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

ఇక, రానా సినిమా ప‌రిస్థితి చూస్తే.. డిజాస్ట‌ర్ వైపే దూసుకెళ్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మొద‌టి ఆట‌తోనే నెగెటివ్ టాక్ రావ‌డంతో రెండో రోజు చాలా థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ లేక షోలు ర‌ద్దు చేశారు. ఇక‌, మూడో రోజైన ఆదివారం కాస్త ప‌ర్వాలేద‌న్న‌‌ట్టుగా క‌నిపించింది. కానీ.. సినిమా లేవాలంటే ఈ రేంజ్ స‌రిపోదు. వ‌రల్డ్ వైడ్ గా ఈ సినిమాకు కేవ‌లం రూ.2 కోట్లు మాత్ర‌మే షేర్ వ‌చ్చింది.

కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా వచ్చిన ‘తెల్ల‌వారితే గురువారం’ మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో.. ఈ సినిమాకు ఆదివారం కూడా ప్రేక్షకులు కరువయ్యారు. సోమవారం నుంచి ఈ సినిమాను చాలా థియేటర్లను తీసేయబోతున్నారట. రెండు రోజుల్లో కనీస స్థాయిలో కలెక్షన్లు రాలేదని సమాచారం. దీంతో.. ఈ సినిమా ఫలితం చెప్పడానికి డిజాస్టర్ అనే పదం కూడా చిన్నదే అవుతుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్