
ఓ 20 ఏళ్ల కిందటి వరకు మారుమూల అడువులకు సమీపన ఉన్న గ్రామాల్లో మావోయిస్టులు ఉండేవారు. అటూ ఇటూ తచ్చాడే వారు. చాలామంది జర్నలిస్టులు.. అటవీ ప్రాంత గ్రామాల వారికి మావోయిస్టులతో పరిచయాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం మావోయిస్టులు కనుమరుగయ్యారు. ఎన్ కౌంటర్లు, కూంబింగ్ లతో తెలుగు రాష్ట్రాల్లో వారి జాడ కానరావడం లేదు. ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు నక్సలైట్ల తీవ్రత ఎక్కువగా ఉండేది. రాను రాను వారి ఉనికి తగ్గింది. ఇప్పుడు సినిమాల్లోనే వారి దర్శనభాగ్యం దక్కుతోంది.
టాలీవుడ్ లో ‘నక్సలైట్ల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా హిట్ అయ్యాయి. ఆర్ నారాయణ మూర్తి అప్పట్లో ఓ ఊపు ఊపేశాడు. ఆనాటి మా భూమి నుంచి నేటి ఆచార్య వరకు నక్సలిజంను బేస్ చేసుకొని వచ్చినవే. ఆచార్యలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నక్సలైట్లుగా కనిపించనున్నారట.. ఇందుకు సంబంధించిన పిక్ ఒకటి విడుదలై హల్ చల్ సృష్టిస్తోంది.
20 ఏళ్ల క్రతి ఆర్ నారాయణ మూర్తి తీసిన ఎర్రసైన్యం, చీమల దండు.. దాసరి తీసిన ఓ‘సేయ్ రాములమ్మ’ సినిమాలు బంపర్ హిట్టు కొట్టాయి. అంతేకాకుండా ఎక్కువ రోజులు నడిచాయి. ఓసేయ్ రాములమ్మ సినిమా 200 రోజులు నడిచింది. అయితే రాను రాను అలాంటి సినిమాలు తగ్గి ట్రెండ్ కు తగ్గట్టుగా కథాంశాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ సినిమాలు తీస్తున్నారు దర్శకులు. తాజాగా రానా తీస్తున్న ‘విరాటపర్వం’తోపాటు చిరంజీవి ‘ఆచార్య’తో మళ్లీ మావోయిస్టుల కథాంశాలకు పెద్దపీట లభించింది.. ఈ నేపథ్యంలో నక్సలిజాన్ని బేస్ చేసుకొని వచ్చిన సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఆచార్య (చిరంజీవి), విరాట పర్వం (రానా దగ్గుబాటి), జార్జిరెడ్డి (సందీప్ కుమార్), జల్సా (పవన్ కల్యాణ్) , 143 (సాయిరామ్ శంకర్) విరోధి (శ్రీకాంత్), సింధూరం (రవితేజ) , అయోధ్య రామయ్య (శ్రీహరి), డియర్ కామ్రేడ్ (విజయ్ దేవరకొండ) అప్పట్లో ఒకటుండేవాడు (శీ విష్ణు), గమ్యం (శర్వానంద్, అల్లరి నరేశ్), మా భూమి (సాయిచంద్), ఎర్రసైన్యం (ఆర్.నారాయణమూర్తి), యువతరం కదిలింది (మురళీ మోహన్), ఓసేయ్ రాములమ్మ (విజయశాంతి), దళం(నవీన్ చంద్ర) , అడవిలో అన్న (మోహన్ బాబు),