https://oktelugu.com/

‘రెడ్ ట్రైలర్’ టాక్: డబుల్ రోల్ లో షేక్ చేసిన ‘రామ్’

సంక్రాంతి వస్తుండడంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఊపు వస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘రెడ్’, ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ, నివేథ పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. Also Read: పాన్ ఇండియా దర్శకులకు ప్రభాసే కావాలట! ఇప్పటికే విడుదలైన ప్రచార […]

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2020 / 12:51 PM IST
    Follow us on

    సంక్రాంతి వస్తుండడంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఊపు వస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ‘రెడ్’, ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ, నివేథ పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు.

    Also Read: పాన్ ఇండియా దర్శకులకు ప్రభాసే కావాలట!

    ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

    థియేటర్స్ రీఓపెన్ అవుతుండడంతో ఇప్పుడు ‘రెడ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా ‘రెడ్’ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

    Also Read: బిగ్ బాస్ కోసం జబర్ధస్త్ కి పదిలక్షలు చెల్లించా… అవినాష్ సంచలనం!

    ఈ ట్రైలర్ చూస్తే రామ్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక అమ్మాయితో ఎఫైర్ గురించి మొదట ట్రైలర్ స్ట్రాట్ అవుతుంది. అన్నదమ్ముల లొల్లి ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది చూపించారు.

    రామ్ ఒక క్యారెక్టర్ లో సాఫ్ట్ గా.. మరో క్యారెక్టర్ లో వైలెంట్ గా కనిపించారు. మణిశర్మ సంగీతం అదిరిపోయింది. పోసాని, సోనియా, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తడమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘రెడ్’ మూవీ ట్రైలర్ ఇదే..