తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతోన్నాయి. గత ఆరేళ్లుగా ఎదురు లేకుండా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కొద్దిరోజులుగా చతికిలబడుతోంది. వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ వెనుకబడటంపై సీఎం కేసీఆర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీ డీజీపీ ఇంటిపై డ్రోన్ కెమెరాలు.. ఎగురవేసింది ఎవరు?
దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ పోరాడింది. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ సత్తాచాటడంతో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.
దీంతో కాంగ్రెస్.. టీఆర్ఎస్ చెందిన ముఖ్య నేతలు బీజేపీలోకి వెళుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు బీజేపీ నేతలతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నారు.
పదవులపై ఆశలతో టీఆర్ఎస్ లో చేరిన నేతలు.. పదవులు దక్కని నేతలంతా అసంతృప్తితో ఉన్నారు. వీరంతా గోడదూకేందుకు రెడీగా ఉండటంతో టీఆర్ఎస్ అధిష్టానం వారికి కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.
కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఇంట్రస్టు ఉండటం.. వయస్సు భారం.. అనారోగ్య సమస్యలతో సీఎం పదవీ నుంచి తప్పుకుంటారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే దీనిని సీఎం కేసీఆర్ పలుమార్లు ఖండించారు.
Also Read: పాదయాత్రలకు ధీటుగా ‘బండి’ యాత్ర..!
అయితే తాజాగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ డోర్నకల్ లో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ మార్చిలోపు తెలంగాణ సీఎం కేటీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పారు.
రెడ్యా నాయక్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ముందస్తు వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
దీనిలో భాగంగానే టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ పరంగా.. పాలన పరంగా మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం మార్పుపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కావాలనే టీఆర్ఎస్ నుంచి ఇలాంటి లీకులు వస్తున్నాయనే టాక్ విన్పిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్