https://oktelugu.com/

పాపులర్ సెక్స్‌ వర్కర్ పాత్రలో రకుల్‌!

ఢిల్లీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో షార్ట్‌ టైమ్‌లోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. రకుల్‌ హీరోయిన్‌గా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ హిట్‌ కావడంతో తెలుగులో ఆమె కెరీర్కు గట్టి పునాది పడింది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిందామె. గ్లామర్ షోతో యువత హార్ట్‌ బీట్‌ పెంచింది అయితే, కొన్నాళ్లుగా ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంటుంది. మహేష్‌ బాబు సరసన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 15, 2020 / 01:18 PM IST
    Follow us on

    ఢిల్లీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్టాలీవుడ్‌లో షార్ట్‌ టైమ్‌లోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. రకుల్‌ హీరోయిన్‌గా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ హిట్‌ కావడంతో తెలుగులో ఆమె కెరీర్కు గట్టి పునాది పడింది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిందామె. గ్లామర్ షోతో యువత హార్ట్‌ బీట్‌ పెంచింది అయితే, కొన్నాళ్లుగా ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంటుంది. మహేష్‌ బాబు సరసన స్పైడర్, నాగార్జునతో కలిసి చేసిన మన్మధుడు-2 ఫ్లాప్‌ కావడంతో ఆమెకు నిరాశ ఎదురైంది. అప్పటి నుంచి ఎక్కువగా హిందీ, తమిళ్‌ సినిమాలే చేస్తోంది కమల్‌ హాసన్‌- శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్‌-2లోనూ ఆమె నటిస్తోంది. తెలుగు నుంచి అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌లో ఎలాంటి సినిమాలకైనా ఓకే అంటోంది. బోల్డ్ పాత్రల్లో క‌నిపించేందుకు కూడా రెడీ అయింది.

    సుశాంత్ ఆత్మహత్యలో ఊహించని ట్విస్ట్!

    తెలుగుతో పోలిస్తే ఇప్పటికే తన బాలీవుడ్‌ చిత్రాల్లో ఎక్కువ అందాలు ఆరబోసిన ఆమె ఇప్పుడు ఓ వేశ్య పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఇది చాలా ప్రెస్టీజియల్‌ ప్రాజెక్ట్‌ అని తెలుస్తోంది. ఒక సెక్స్‌ వర్కర్ బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ చేసేందుకు రకుల్‌ సిద్ధపడిందని సమాచారం. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్యగా ఆమె న‌టించ‌నుంద‌ట‌. ఇలాంటి పాత్ర చేయడం రకుల్‌ కు కొత్తేం కాదు. ‘మర్జావా’లో చిత్రంలో బార్ డ్యాన్సర్ రోల్‌ చేసింది. కానీ, దానితో పోలిస్తే తాజా చిత్రం పూర్తి భిన్నంగా ఉండనుంది. రెడ్‌ లైట్‌ ఏరియాలో జీవితాలు, పాపులర్ సెక్స్‌ వర్కర్గా రకుల్‌ పాత్ర చాలా బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా ఉంటుందట. అందుకు మంచి ఫిజిక్‌ ఉన్న రకుల్‌ను దర్శక నిర్మాతలు సంప్రదించగా.. కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబా కథియావాడి’ మూవీ తీస్తున్నాడు. ఇది కూడా సెక్స్‌ వర్కర్ జీవితకథే. రకుల్‌ అంత ఎత్తు, శరీరాకృతి లేకపోయినా నటనలో ఆలియా రేంజే వేరు. మరి, ఒకే పాయింట్‌ రాబోతున్న ఈ చిత్రాల్లో ఆలియా, రకుల్‌లో ఎవరి పెర్ఫామెన్స్‌ బాగుంటుందో చూడాలి.

    చిరు చెల్లి పై రూమర్స్.. ఫైనల్ చేయలేదు !