Lenin Movie Villain: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాతో అఖిల్ టాప్ హీరోగా మారిపోతున్నాడు అంటు కొంతమంది కామెంట్స్ చేస్తున్నప్పటికి మరికొంతమంది మాత్రం అఖిల్ ఈ సినిమాతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ కి ఒక భారీ ఎలివేషన్ సీన్ పడింది. హీరోకి అలాంటి ఒక సీన్ పడకపోవడం పట్ల అతని అభిమానులు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద దర్శకుడు కొంతవరకు క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు. హీరో క్యారెక్టర్ కి అంత ఎలివేషన్ అవసరం లేదని విలన్ సడన్ గా తన విలనిజాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నాడు కాబట్టి అందుకోసమే తనకోస్మ సెపరేట్ గా ఒక సెటప్ చేసుకున్నామని దర్శకుడు చెప్పాడు. ఇక హీరో ఆల్రెడీ మొదటి నుంచి కూడా తమ హీరోయిజాన్ని చూపించాడు. కాబట్టి తనకి ప్రత్యేకంగా ఎలివేషన్ అవసరం లేదని చెప్పాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్టులు చాలా అద్భుతంగా పేలాయి. ప్రతి ట్విస్ట్ కూడా ప్రేక్షకుడిని థ్రిల్ కి గురిచేసింది. అందువల్ల ఈ సినిమాతో ప్రేక్షకులందరు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నారు… ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.
కాబట్టి ఈ సినిమా సక్సెస్ తీరాలను చేరిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి సినిమాలను చేస్తు ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన మరింత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం రావచ్చు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఇప్పటివరకు అఖిల్ కి దక్కిన సక్సెస్ అయితే లేదు. కాబట్టి ఇది అతనికి దక్కిన మొదటి సక్సెస్ గా అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే నాగార్జున సైతం తన కొడుకు కోసం పెట్టిన ఎఫర్ట్స్ సక్సెస్ అయ్యాయని ఈ సినిమా అతన్ని టాప్ హీరోగా నిలబెడుతుందని అతను భావిస్తున్నాడు…
