https://oktelugu.com/

సచిన్ పైలట్ దారెటు?

రాజస్థాన్ లో గత కొన్ని రోజులుగా రాజకీయ పరిస్థితులు వేడి పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పైలట్ తన వర్గం ఎమ్మెల్యేతో ఢిల్లీలో తిష్ట వేశాడు. సీఎల్పీ సమావేశానికి రెండు సార్లు ఆహ్వానం పంపినప్పటికీ…. పైలట్ మాత్రం రాలేదు. ఢిల్లీలోనే తన 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ…. అది జరగలేదు. సచిన్ పైలట్ తాను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 15, 2020 / 11:41 AM IST
    Follow us on


    రాజస్థాన్ లో గత కొన్ని రోజులుగా రాజకీయ పరిస్థితులు వేడి పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పైలట్ తన వర్గం ఎమ్మెల్యేతో ఢిల్లీలో తిష్ట వేశాడు. సీఎల్పీ సమావేశానికి రెండు సార్లు ఆహ్వానం పంపినప్పటికీ…. పైలట్ మాత్రం రాలేదు. ఢిల్లీలోనే తన 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ…. అది జరగలేదు. సచిన్ పైలట్ తాను ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నానని, తాను కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలనుకోవడం లేదని అంటున్నాడు. అయితే సచిన్ పైలట్ నిజంగానే ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నట్లయితే సొంత పార్టీని నెలకొల్పే ప్రయత్నం చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులను చూడబోతుంటే కూడా అలానే కనబడుతున్నాయి.

    ప్రస్తుతం సచిన్ పైలట్ ని చూస్తుంటే… 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ రాజకీయాలలో చోటుచేసుకున్న పరిస్థితులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు సీఎం పదవి ఇవ్వలేదని, ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అలాగే గతంలో రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకొని, బలమైన, సామాజికవర్గ నేతగా పార్టీలో మంచి పేరును తెచ్చుకొని, సీఎం పోస్ట్ తనకు దక్కలేదని, కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేసి చివరికి బీజేపీ లో చేరారు కిరోరి సింగ్ గుజ్జర్. సచిన్ పైలట్ ఇప్పుడు ఎం చేస్తాడన్న విషయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తుంది. సచిన్ పైలట్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ వలే మరో కొత్తపార్టీని ఏర్పాటు చేసి రాజస్థాన్ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చూడతారా…? లేక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకే ఛాన్స్ ఉందని గ్రహించి బీజేపీలో చేరిపోతారా తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి..