https://oktelugu.com/

‘నమో’ ఆశీర్వాదం తీసుకున్న రజనీ..!

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త ఏడాదిలో రాజకీయ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. అయితే అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయాల్లోని నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. అయితే రజనీ ఆరోగ్యమే అన్నింటి కంటే ముఖ్యం కావడంతో అందరూ ఆ ప్రకటనను అర్థం చేసుకునే పడ్డారు. రజనీకాంత్ అనారోగ్యం బారిన డిశార్చ్ అయ్యాక బయట ఎక్కడా కన్పించలేదు. రాజకీయ భేటిలు.. సమావేశాలు.. సినిమాలు.. ఇతర వ్యవహరాలన్నింటికి రజనీకాంత్ దూరంగా ఉంటూ వస్తున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 12:33 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త ఏడాదిలో రాజకీయ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. అయితే అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయాల్లోని నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు.

    రజనీకాంత్ రాజకీయ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. అయితే రజనీ ఆరోగ్యమే అన్నింటి కంటే ముఖ్యం కావడంతో అందరూ ఆ ప్రకటనను అర్థం చేసుకునే పడ్డారు.

    రజనీకాంత్ అనారోగ్యం బారిన డిశార్చ్ అయ్యాక బయట ఎక్కడా కన్పించలేదు. రాజకీయ భేటిలు.. సమావేశాలు.. సినిమాలు.. ఇతర వ్యవహరాలన్నింటికి రజనీకాంత్ దూరంగా ఉంటూ వస్తున్నారు.

    అయితే తాజాగా రజనీకాంత్ ఆధ్యాత్మిక వేత్త నమో నారాయణస్వామిని కలిసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్న తొలిసారి ఆధ్యాత్మిక వేత్త నమో నారాయణస్వామిని కలిసినట్లు తెలుస్తోంది.

    నమో నారాయణ స్వామి రజనీ ఇంటికి వెళ్లి కాసేపు ఆయనతో గడిపారు. ఈ సందర్భంగా రజనీ దంపతులకు నారాయణస్వామి ఆశీర్వదం అందించారు. అనంతరం రజనీ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.