https://oktelugu.com/

‘డ్యూటీ మీట్’ పోలీసుల పనితీరును మారుస్తుంది: ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఫస్ట్ డ్యూటీ మీట్ ను సోమవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడపల్లిలోని క్యాంపు కార్యాలయంలోవర్చవల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత పోలీస్ డ్యూటీ మీట్ ను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టెక్నాలజీ […]

Written By: , Updated On : January 4, 2021 / 12:29 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఫస్ట్ డ్యూటీ మీట్ ను సోమవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడపల్లిలోని క్యాంపు కార్యాలయంలోవర్చవల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత పోలీస్ డ్యూటీ మీట్ ను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టెక్నాలజీ మెరుగుపరిచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.