https://oktelugu.com/

రాజమౌళి మళ్లీ లేట్.. ఎన్టీఆర్ చెప్పినట్టే జరిగిందిగా..!

దర్శకదిగ్గజం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగు వాయిదా పడగా ఇటీవల తిరిగి ప్రారంభింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం అత్రుతగా ఎదురు చూస్తున్నారు. Also Read: బాలయ్య వర్సెస్ మెగాస్టార్.. ఫ్యాన్స్ లొల్లి షూరు..! నాలుగైదు రోజులు టీజర్ రిలీజు విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీం కౌంట్ డౌన్ స్టాట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 12:51 PM IST
    Follow us on

    దర్శకదిగ్గజం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగు వాయిదా పడగా ఇటీవల తిరిగి ప్రారంభింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం అత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    Also Read: బాలయ్య వర్సెస్ మెగాస్టార్.. ఫ్యాన్స్ లొల్లి షూరు..!

    నాలుగైదు రోజులు టీజర్ రిలీజు విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీం కౌంట్ డౌన్ స్టాట్ చేసింది. దీంతో ఈ మూవీ టీజర్ పై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ వస్తోంది. ఈనేపథ్యంలోనే బుధవారం మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ సంబంధించిన ఓ స్పెషల్ గ్లిమ్స్ తో ట్వీటర్లో సందడి చేశాడు.

    ఈసందర్భంగా తారక్-చెర్రీ మధ్య ట్వీటర్లో సరదా సంభాషణ జరిగింది. ‘తారక్ బ్రదర్.. నిన్ను టీజ్ చేసేలా ఓ స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేస్తున్న.. నీలాగా కాకుండా చెప్పిన సమయానికి ‘రామరాజు ఫర్ బీమ్ విడుదల చేస్తా’ అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తారక్ సైతం తనదైన శైలిలో స్పందించాడు.

    ‘సోదరా.. ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యమయ్యావనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.. జక్కన్నతో డీలింగ్ అషామాషీ కాదు.. నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండు.. ఏదైనా జరగొచ్చు.. ఏదిఏమైనా పూర్తి వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ తారక్ రిప్లయ్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ చెప్పినట్లు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ విషయంలో మళ్లీ ఆలస్యమయ్యాడు.

    ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ను గురువారం ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రకటించింది. అయితే అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నాం.. మరో అరగంట వెయిట్ చేయండి అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ అన్నట్లే జరిగిందిగా అంటూ ఫ్యాన్స్ ఉసురుమన్నారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ టీజర్ టాక్: నా తమ్ముడు.. గోండు బెబ్బులి ‘కొమురం భీం’

    కాగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కొంత ఆలస్యమైనప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గూస్ బంప్స్ వచ్చేలా ఎన్టీఆర్ టీజర్ ఉంది. ఎన్టీఆర్ యాక్షన్ కు చెర్రీ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ప్రస్తుతం ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    https://twitter.com/tarak9999/status/1319153940068405248?s=20