అధికారులు, లీడర్ల పేరిట దందాలు!

రాజకీయాల్లో పేరు వస్తుందంటే ఆయన పేరును డ్యామేజీ చేయడానికి ఎంతో మంది పుట్టుకొస్తూనే ఉంటారు. ఆ పర్సన్‌కు సంబంధం లేకుండానే ఏవేవో జరిగిపోతుంటాయి. వారి పేరిట దందాలు నడుస్తుంటాయి. విషయం తెలిసే లోపే కావాల్సిన డ్యామేజీ అంతా జరిగిపోతుంటుంది. చివరు పోలీసులను ఆశ్రయించడం.. ఆ బాధితులెవరో వెలుగు చూడడం.. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. Also Read: అమరావతి పునాదికి ఐదేళ్లు ఇలాంటి వాటికి ఇప్పుడు తాజా బాధితుడు కల్లం అజయ్ రెడ్డి అలియాస్‌ అజయ్‌ కల్లాం. ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : October 22, 2020 1:20 pm
Follow us on

రాజకీయాల్లో పేరు వస్తుందంటే ఆయన పేరును డ్యామేజీ చేయడానికి ఎంతో మంది పుట్టుకొస్తూనే ఉంటారు. ఆ పర్సన్‌కు సంబంధం లేకుండానే ఏవేవో జరిగిపోతుంటాయి. వారి పేరిట దందాలు నడుస్తుంటాయి. విషయం తెలిసే లోపే కావాల్సిన డ్యామేజీ అంతా జరిగిపోతుంటుంది. చివరు పోలీసులను ఆశ్రయించడం.. ఆ బాధితులెవరో వెలుగు చూడడం.. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.

Also Read: అమరావతి పునాదికి ఐదేళ్లు

ఇలాంటి వాటికి ఇప్పుడు తాజా బాధితుడు కల్లం అజయ్ రెడ్డి అలియాస్‌ అజయ్‌ కల్లాం. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. అయితే.. ఆయన పేరు చెప్పి కొంత మంది ఉద్యోగాలు.. కాంట్రాక్టులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారట. ఇలా డబ్బులు ఇచ్చిన కొంత మంది గురించి అజేయ కల్లాంకు తెలియడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. తన పేరిట మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.

కొద్ది రోజుల క్రితం మరో కీలక ఆఫీసర్‌‌ పీవీ రమేశ్‌కు కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. ఆయన పేరును వాడింది ఏ చిల్లర దొంగలో కాదు.. నూతన్ నాయుడు. ఆయన ఎవరో అందరికీ తెలిసిందే. పీవీ రమేశ్‌ పేరు వాడుకొని ఏకంగా తాను ఇరుక్కున్న శిరోముండనం కేసు నుంచి బయటపడాలనుకున్నారు. విషయం తెలియడంతో ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతర కేసులతో పాటు పీవీ రమేశ్‌ పేరును వాడుకున్న కేసు కూడా నూతన్ నాయుడు పై నమోదైంది. వీరిద్దరు అధికారులే కాదు.. నేరుగా స్పీకర్ పేరును వాడుకుంటూ కూడా కొంత మంది దందాలు చేశారు. ఈ వ్యవహారమూ దుమారమే రేపింది.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో 2,624 వాలంటీర్ల ఉద్యోగాలు..?

చివరగా.. స్పీకర్‌‌ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్పీకర్‌‌ పేరుతో సెక్రటేరియట్‌లోనే ఓ వ్యక్తి దందాలు చేస్తున్నాడని, అతనితో స్పీకర్‌‌కు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ఇలా వరుసగా ప్రభుత్వంలో కీలకంగా ఉండే వారి పేర్లను ఉపయోగించుకుని ఉద్యోగాలు.. కాంట్రాక్టుల పేరుతో ఇతరుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నేరాలు ఏపీలో పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అటు లీడర్లు అలర్ట్‌గా ఉంటూనే.. పోలీసులూ తమ దైన స్టైల్‌లో చర్యలు చేపడితేనే ఈ దందాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.