https://oktelugu.com/

ఉల్లిగడ్డ భారం: తెలుగు రాష్ట్రాల ‘ఉల్లి’ కన్నీరు

ఉల్లి.. ఆరోగ్య వల్లి.. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.. ఉల్లేసి చూడు.. టేస్టేంతో మారు ఇలా ఉల్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టిఫిన్లు, కర్రీలు, ఫ్రైలు, బజ్జీలు.. ఇలా ఏదైనా ఉల్లి జోడిస్తేనే ఆ రుచే వేరబ్బా.. పెరుగన్నంలో ఉల్లిపాయ కలుపుకుని తింటే ఉంటుంది.. నా సామిరంగ.. ఇలా ఆహార ప్రియులు ఉల్లిపై మమకారం ప్రదర్శిస్తూనే ఉంటారు. ఉల్లంటే తినేదే కాదు సుమా.. దీనికి రాజకీయాలు కూడా చేయడం వచ్చు. దీని పవర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 12:56 PM IST
    Follow us on

    ఉల్లి.. ఆరోగ్య వల్లి..
    ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు..
    ఉల్లేసి చూడు.. టేస్టేంతో మారు
    ఇలా ఉల్లి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టిఫిన్లు, కర్రీలు, ఫ్రైలు, బజ్జీలు.. ఇలా ఏదైనా ఉల్లి జోడిస్తేనే ఆ రుచే వేరబ్బా.. పెరుగన్నంలో ఉల్లిపాయ కలుపుకుని తింటే ఉంటుంది.. నా సామిరంగ.. ఇలా ఆహార ప్రియులు ఉల్లిపై మమకారం ప్రదర్శిస్తూనే ఉంటారు. ఉల్లంటే తినేదే కాదు సుమా.. దీనికి రాజకీయాలు కూడా చేయడం వచ్చు. దీని పవర్ కు అధికార పార్టీల పీఠాలు విరిగిన ఘన చరిత్ర కూడా ఇది సొంతం చేసుకుందంటే మాటలా.. అలాంటి ఉల్లి.. మళ్లీ ఇప్పుడు ఘాటెక్కింది. ధరల మోత మోగిస్తోంది. అదే ఇప్పుడూ చర్చనీయాంశమైంది.

    తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా మరో సారి ఉల్లి ధరలు కొండెక్కాయి. మార్కెట్ లో మొన్నటి వరకు కిలో 25 రూపాయలు పలికిన ఉల్లి.. ఇప్పుడు ఆమాంతం 75రూపాయలకు చేరుకుంది. బుధవారం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.84 కూడా అమ్ముడుపోయింది.

    Also Read: అధికారులు, లీడర్ల పేరిట దందాలు!

    మహారాష్ట్ర, కర్నాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గోడౌన్లలో నిల్వ ఉన్న ఉల్లిని మార్కెట్ లోకి వదిలి ధరలు తగ్గిద్దామా అని ప్రభుత్వాలు అనుకున్నా.. భారీ వర్షాలు, వరదలకు నిల్వ ఉంచిన ఉల్లి దాదాపు 40శాతం కుళ్లిపోయినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. మరో సారి కిలో రూ.150ని తాకడం గ్యారెంటీ అని అంటున్నారు.

    ఈ పరిస్థితులను గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలు నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఖరీఫ్ ముగిసే నాటికి దేశీయ ఉల్లి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న కేంద్రం.. ఈలోగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేలా నిబంధనలను సడలించింది. ఎగుమతి చేసే దేశాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. అయితే ఈ విషయంలో కేంద్రం ఆలస్యం చేసిందని, ఈనెల ప్రారంభంలోనే చర్యలు చేపట్టాల్సింది పోయి ఇప్పుడు అనుమతులివ్వడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.
    మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ఎఫెక్ట్ ను ఎలా ఎదుర్కొంటారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ఉల్లి ధరలు భారీగా పెరిగినప్పుడు జగన్ సర్కార్.. కిలో కేవలం 15రూపాయలకే సరఫరా చేసింది. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో నిల్వలు పెంచి, మార్కెట్ రేటు రూ.70ఉన్న టైంలో 15రూపాయలకే విక్రయించింది.

    Also Read: అమరావతి పునాదికి ఐదేళ్లు

    అయితే ఈసారి భారీ వర్షాలు, కేంద్ర నిబంధనల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనబడడం లేదు. తెలంగాణలో కూడా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉల్లి దిగుమతుల కోసం మహారాష్ట్ర పై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే మహారాష్ట్రలో దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో.. మరో వైపు టర్కీ, ఈజిప్టు దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ ప్రజలు మరోసారి ఉల్లి కన్నీళ్లు పెట్టక తప్పేట్టు లేదు.