https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ టీజర్ రెడీ.. అభిమానులకు రాజమౌళి సర్ ప్రైజ్?

‘కేజీఎఫ్2’ టీజర్ రిలీజ్ చేసి సృష్టించిన ప్రకంపనలను అధిగమించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్లు రాంచరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్ ప్రైజ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. Also Read: గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు – అనిల్ రావిపూడి ! కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో ఇప్పటికే చిత్రబృందం షూటింగ్ ను మొదలు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 08:11 PM IST
    Follow us on

    ‘కేజీఎఫ్2’ టీజర్ రిలీజ్ చేసి సృష్టించిన ప్రకంపనలను అధిగమించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్లు రాంచరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్ ప్రైజ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు – అనిల్ రావిపూడి !

    కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో ఇప్పటికే చిత్రబృందం షూటింగ్ ను మొదలు పెట్టింది. అన్నట్లుగానే చకచకా షూటింగ్ ప్రారంభించి షార్ట్ గా ‘కొమురం భీం’ టీజర్ ను విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క అప్ డేట్ కూడా రాలేదు.

    ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ రాజమౌళి ట్విస్ట్ ఇచ్చాడు. ‘ఈ ఏడాది మీకు అద్భుతమైన అనుమూతిని ఇస్తాం’ అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

    ఈ క్రమంలోనే సంక్రాంతికి ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తాడా? అని ఎదురుచూస్తున్నారు. తెలుగు నాట సంక్రాంతిపెద్ద పండుగ కావడంతో రాజమౌళి ఖచ్చితంగా ఏదైనా అప్ డేట్ ఇస్తాడని ఆశిస్తున్నారు.

    Also Read: మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్.. మాస్ రాజా ఈజ్ బ్యాక్ !

    అయితే తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ ను విడుదల చేసే ప్లాన్ ను చేస్తున్నాడట రాజమౌళి. స్వాతంత్ర్య సంగ్రామం నాటి కథకావడంతో ఆ రోజున విడుదల చేస్తే హైప్ వస్తుందని రాజమౌళి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    త్వరలో విడుదల చేయబోయే టీజర్ కు అగ్రహీరో చిరంజీవితో వాయిస్ ఇప్పించాలని చిత్రబృందం యోచిస్తోందట.. దీంతో ఈ నెలలో ఖచ్చితంగా కేజీఎఫ్2ను మించిపోయేలా రాజమౌళి టీజర్ ఉంటుందని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్