https://oktelugu.com/

వీళ్లకే తొలి టీకాలు.. ధర ఎంతంటే?

దేశాన్ని కరోనా కోరల నుంచి రక్షించడానికి కేంద్రం రెడీ అయ్యింది. ఇప్పటికే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండు కరోనా టీకాలకు అత్యవసర అనుమతులు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు వాటిని ప్రజలకు పంచేందుకు రెడీ అయ్యింది. జనవరి 16 నుంచి దేశంలోని ఫ్రంట్ లైన్ కార్మికులకు తొలుత టీకాను వేయనున్నారు. Also Read: తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. తొలి సంతానం ఎవరంటే? కేంద్రప్రభుత్వం నుంచి కొనుగోలు ఆర్డర్ ను అందుకున్నట్లు వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ సంస్థ ధ్రువీకరించింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 09:27 PM IST
    Follow us on

    దేశాన్ని కరోనా కోరల నుంచి రక్షించడానికి కేంద్రం రెడీ అయ్యింది. ఇప్పటికే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండు కరోనా టీకాలకు అత్యవసర అనుమతులు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు వాటిని ప్రజలకు పంచేందుకు రెడీ అయ్యింది. జనవరి 16 నుంచి దేశంలోని ఫ్రంట్ లైన్ కార్మికులకు తొలుత టీకాను వేయనున్నారు.

    Also Read: తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. తొలి సంతానం ఎవరంటే?

    కేంద్రప్రభుత్వం నుంచి కొనుగోలు ఆర్డర్ ను అందుకున్నట్లు వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ సంస్థ ధ్రువీకరించింది. కోవిషీల్డ్  వ్యాక్సిన్ ఒక డోసుకు 200 రూపాయల చొప్పున అందించనున్నట్లు సీరమ్ సంస్థ తెలిపింది. ప్రతి వారం కొన్ని మిలియన్ మోతాదుల కోవిషీల్డ్ సరఫరా చేస్తామని.. , ప్రారంభంలో 11 మిలియన్ మోతాదులను సరఫరా చేయవచ్చునని తెలుస్తోంది.

    తొలి దశలో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది.. ఫ్రంట్ లైన్ కార్మికులకు టీకాను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ ఖర్చంతా కేంద్రప్రభుత్వమే భరిస్తుందని.. రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాలపై నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమవేశంలో ప్రధాని మోడీ భేటి అయ్యారు.

    Also Read: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో కిలో చికెన్ ఎంతంటే..?

    టీకా పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో ప్రధాని చర్చించారు. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో భేటి అవుతానని ప్రధాని మోడీ తెలిపారు. తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిద్దామని చెప్పారు.

    తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు ఈ టీకా ఇస్తామన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు ఉండబోరని మోడీ స్పష్టం చేశారు. రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యతనిస్తామన్నారు. జూలై నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్