5న ఢిల్లీకి రాహుల్.. పీసీసీపై అయోమయం..!

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకత వచ్చే పరిస్థితులే కన్పిసున్నాయి. దీంతో అధిష్టానం పీసీసీపై నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. Also Read: కరోనా వాక్సి‘నేషన్’.. ఐదు దశల్లో..! కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా గ్రూపు రాజకీయ కొనసాగుతున్నారు. ఎవరికీ వారు పీసీసీ చీఫ్ పదవీని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. […]

Written By: Neelambaram, Updated On : January 3, 2021 1:01 pm
Follow us on

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకత వచ్చే పరిస్థితులే కన్పిసున్నాయి. దీంతో అధిష్టానం పీసీసీపై నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది.

Also Read: కరోనా వాక్సి‘నేషన్’.. ఐదు దశల్లో..!

కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా గ్రూపు రాజకీయ కొనసాగుతున్నారు. ఎవరికీ వారు పీసీసీ చీఫ్ పదవీని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.

పీసీసీ చీఫ్ పదవీ అధిష్టానం ఎవరికీ ఇచ్చిన కలిసి పని చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో పీసీసీ చీఫ్ పదవీ ఎవరికీ దక్కుతుందా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

కొత్త ఏడాదిలో పీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని భావించగా నేటికి దీనిపై స్పష్టత రావడంలేదు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి ముందే ఇటలీకి వెళ్లిన రాహుల్ గాంధీ ఈనెల 5న ఢిల్లీకి రానున్నాడు.

Also Read: కార్పొరేటర్లపై అనర్హత.. ఎన్నికల కమిషన్ వార్నింగ్..!

రాహుల్ వచ్చిన పీసీసీ చీఫ్ నియామకంపై క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది. దీంతో పీసీసీ చీఫ్ పదవీపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు మరోసారి ఢిల్లీ వెళ్లి సోనియా.. రాహుల్ గాంధీని కలిసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం షోకాజ్ నోటిసు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. మరోవైపు జగ్గారెడ్డి పీసీసీపై అధిష్టానం తొందరపడొద్దని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్