Giorgia Meloni: మెలోని మనదేశీయురాలు కాదు. ఆమెకు మన పౌరసత్వం కూడా లేదు. పైగా తను ఇటలీ ప్రధానమంత్రి. ఇటీవల ట్రంప్ కు చుక్కలు చూపించిన మహిళ. అంతర్జాతీయంగా మీడియాను ఆకర్షించిన రాజకీయ నాయకురాలు. ఇటీవల జీ7 సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐరన్ లేడీ. అటువంటి మెలోని మనదేశంలో పోటీ చేయడం ఏంటి.. అది కూడా 10 లక్షల ఓట్లు రావడం ఏంటి.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
మెలోని కి జాతీయ భావం చాలా ఎక్కువ. పైగా తను రైట్ వింగ్ యాక్టివిస్ట్. దేశం తప్ప మరో వ్యాపకం ఆమెకు ఉండదు. దేశ ప్రయోజనాల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. అంతటి అమెరికాను నేరుగా క్వశ్చన్ చేసింది. అంతేకాదు, తిక్కరి ట్రంప్ కు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. తిక్క తిక్క వేషాలు వేస్తే నార తీస్తాను అంటూ హెచ్చరించింది. తద్వారా అమెరికాను ప్రపంచ దేశాల ముందు చులకన చేసింది. మెలోనికి అమెరికా అంటే ఎంత ద్వేషమో.. ఇండియా అంటే అంత ప్రాణం. బాగా ఇష్టపడుతుంది.
2023లో ఇటలీ ప్రధానమంత్రి హోదాలో ఆమె మనదేశంలో పర్యటించింది. ఆ సమయంలో ఆమెకు భారీగా స్వాగతం లభించింది. ఢిల్లీ నగరంలో ఆమెకు స్వాగతం పలుకుతూ ప్రభుత్వం భారీగా పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఈ స్థాయి స్వాగతం ఆమెకు ఏ దేశంలో కూడా లభించలేదు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన కొత్త పుస్తకం జార్జియా విజన్ లో ప్రస్తావించారు. 2023 సంవత్సరంలో ఢిల్లీలో పర్యటించినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను అందులో పంచుకున్నారు. ఆ పోస్టర్లను.. అక్కడి ప్రజల ఆదరణ చూసి ముచ్చట వేసిందని మేలోని ఆ పుస్తకంలో వ్యాఖ్యానించారు.
“అప్పుడు ఆమె ఢిల్లీలో పర్యటించారు. ఆమెకు అద్భుతమైన స్వాగతం లభించింది. భారత ప్రభుత్వం ఆమెను ప్రత్యేకమైన అతిథిగా స్వీకరించి. వారు అద్భుతమైన హాస్పిటాలిటీ అందించారు. అది నాకు ఎంతో గొప్పగా అనిపించింది. ఒకవేళ ఆమె ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా 10 లక్షల కోట్లు వచ్చేవేమో. నాటి పరిస్థితి చూస్తే అలానే అనిపించిందని” ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మేలోని చెబితే మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది.
