రైతుల కోసం రాహుల్.. అనుహ్య నిర్ణయం..!

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో వణికించే చలిలోనూ సుమారు నెలరోజులుగా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. Also Read: ప్రేమికుల ప్రాణాలు తీసిన వయసు పంజాబ్ రైతులతో మొదలైన రైతు ఉద్యమం క్రమంగా హర్యానా.. యూపీ రైతులకు పాకింది. ఇక రైతు సంఘాలు డిసెంబర్ 8న ఇచ్చిన భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. అన్ని రాజకీయ పార్టీలు.. దేశంలోని ప్రముఖులంతా రైతుల సమస్యలను కేంద్రం […]

Written By: Neelambaram, Updated On : December 23, 2020 8:10 pm
Follow us on


కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో వణికించే చలిలోనూ సుమారు నెలరోజులుగా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.

Also Read: ప్రేమికుల ప్రాణాలు తీసిన వయసు

పంజాబ్ రైతులతో మొదలైన రైతు ఉద్యమం క్రమంగా హర్యానా.. యూపీ రైతులకు పాకింది. ఇక రైతు సంఘాలు డిసెంబర్ 8న ఇచ్చిన భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది.

అన్ని రాజకీయ పార్టీలు.. దేశంలోని ప్రముఖులంతా రైతుల సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాలని కోరారు. కేంద్రం సైతం రైతులతో పలుమార్లు చర్చలు చేపట్టింది. అయితే చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు.

రైతులు చేపడుతున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి మద్దతు తెలుపుతోంది. ఈక్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది నుంచి సంతకాల సేకరణ చేపట్టారు.

Also Read: పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..: కేసీఆర్‌‌ డిమాండ్‌

రైతులకు మద్దతుగా దేశ్యవాప్తంగా రెండుకోట్ల మంది సంతకాలు చేసిన పత్రాన్ని రేపు రాహుల్ గాంధీ రాష్ట్రపతి అందజేయనున్నారు. దీనిలో భాగంగా రేపు ఉదయం విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు రాహుల్ కాలినడనక వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు ప్రతిపక్షాలు సైతం రైతుల డిమాండ్లను పరిష్కరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. రైతులు సైతం కేంద్రం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్