https://oktelugu.com/

బిగ్‌బాస్‌ 4‌లో అభిజిత్ ‌కు… కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్యాకేజ్ !

ప్రపంచ టెలివిజన్ రంగంలో భారీ సక్సెస్ షో గా నిలిచిన బిగ్ బాస్ షో హిందీ, తెలుగు, తమిళం‌,కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన మార్క్‌ చూపిస్తోంది. స్టార్ మా ఛానల్ మరియు OTT ప్లాట్‌ఫాం డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజ‌న్లు విజయవంతంగా ముగించుకుంది.గత ఆదివారం జరిగిన ఫైనల్ లో అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. అభిజీత్ రెండు రాష్ట్రాలలోను ట్రేండింగ్ టాపిక్ లో ఉంటున్నాడు. Also Read: […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 03:58 PM IST
    Follow us on


    ప్రపంచ టెలివిజన్ రంగంలో భారీ సక్సెస్ షో గా నిలిచిన బిగ్ బాస్ షో హిందీ, తెలుగు, తమిళం‌,కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన మార్క్‌ చూపిస్తోంది. స్టార్ మా ఛానల్ మరియు OTT ప్లాట్‌ఫాం డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజ‌న్లు విజయవంతంగా ముగించుకుంది.గత ఆదివారం జరిగిన ఫైనల్ లో అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. అభిజీత్ రెండు రాష్ట్రాలలోను ట్రేండింగ్ టాపిక్ లో ఉంటున్నాడు.

    Also Read: బిగ్‌బాస్‌ 4‌లో అభిజిత్ ‌కు… కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్యాకేజ్ !

    శేఖర్ కమ్ముల డైరెక్షన్లో “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ సినిమా పెద్దగా హిట్టవ్వకపోయిన మంచి గుర్తింపు అందుకున్నడు. ఆ తరువాత మిర్చి లాంటి కుర్రోడు, రామ్ లీల లాంటి సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత “పెళ్లిగోల ” వెబ్ సిరీస్ తో బాగానే అలరించాడు. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం దక్కని సమయంలో క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ లో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. 105రోజుల పాటు కొనసాగిన బిగ్ బాస్ లో అభిజిత్ తన వ్యక్తిత్వంతో, ఆటిట్యూడ్ తో ప్రేక్షకులని అలరించాడు. హడావిడి చేయకుండా హుందాగా వ్యవహరిస్తూ తోటి సభ్యుల తప్పులు తనకి అనుకూలంగా మార్చుకుంటూ చివరి వరకు కష్టపడ్డాడు. అత్యధిక మెజారిటీ వోటింగ్స్ తో బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నాడు.

    బిగ్ బాస్ విన్నర్ గా బయటకి వచ్చిన తర్వాత అభిమానులు అభి గురించి రకరకాల విషయాల మీద ఫోకస్ పెట్టారు. అభిజీత్ మరియు హారికలు సంబంధం గురించి చర్చ బాగానే జరిగింది, అయితే అందరికి షాక్ ఇస్తూ హారిక తనకు చెల్లిలాగా అని సెలవిచ్చాడు,ఆ తర్వాత అభి రెమ్యునరేషన్ ఎంత అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్స్ ని చూసాక నిర్వాహకులు తక్కువ బడ్జెట్ లోనే ప్లాన్ చేశారని అర్ధమయ్యింది. ఎక్కువగా రెమ్యునరేషన్ భారం పడకుండా కంటెస్టెంట్స్ ను తక్కువ పేమెంట్స్ కు ఒప్పించి రప్పించారని కథనాలు కూడా వచ్చాయి.

    Also Read: అందుకే అభిజీత్ విన్నర్ అయ్యాడు… అసలు విషయం బయటపెట్టిన నాగ్

    బిగ్ బాస్ గత సీజన్ల బడ్జెట్ కంటే ఈ సీజన్ బడ్జెట్ తక్కువనే అయినప్పటికీ కంటెస్టెంట్స్ కి మాత్రం వారి ఫేమ్ ని చూసుకుంటే రెమ్యునరేషన్ కూడా గట్టిగానే దక్కిందట. ఇక అభిజిత్ కూడా తన కెరీర్ ను సైతం పక్కనపెట్టి రిస్క్ చేయడంతో మంచి ఆదయమే అందుకున్నాడు. ఒక విధంగా అతనికి సినిమా చేసినా కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చి ఉండేది కాదు. అభిజిత్ 105రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నందుకు రోజుకి రు.60000 చొప్పున అరవై లక్షలు పైగానే దక్కిందట.ఇక ప్రైజ్ మనీ 25లక్షలు,ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కూడా దక్కింది.అభికి లభించిన కోట్లాది ప్రేక్షకుల అభిమానం,గుర్తింపు కి విలువ కట్టలేనివి. అభిజీత్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ , ఒక మూవీ ఆఫర్ ని అభిజీత్ అంగీకరించారని సమాచారం అందుతుంది.బిగ్ బాస్ ఒక్కాసారిగా అభిజీత్ లైఫ్ ని చేంజ్ చేసిందనే చెప్పుకోవాలి. ఈ ఫేమ్ ని ఎలా ఉపయోగించుకుంటాడో చూద్దాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్