https://oktelugu.com/

రూ.5 కోట్లు కట్టాలని పీవీ సింధు నోటీసులు

ఒలింపిక్స్ లో పతకం గెలిచిన పీవీ సింధు ఢిల్లీలో దిగగానే ఘన స్వాగతాన్ని దక్కించుకుంది. కేంద్రమంత్రులు, అధికారులు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కదిలి వచ్చి మరీ స్వాగతం పలికారు. కాంస్యం గెలిచినందుకే సింధుకు ఇంతటి ప్రతిష్ట దక్కింది. ఇక స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా వస్తే ఇంతటి ఘనత దక్కుతుందో లేదో కూడా తెలియదు. అయితే తనకు వచ్చిన ఫేమ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న కార్పొరేట్ కంపెనీలకు షాకిస్తూ రూ.5 కోట్లు కట్టాలని పీవీ సింధు తాజాగా ఒక్కో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2021 10:34 am
    Follow us on

    ఒలింపిక్స్ లో పతకం గెలిచిన పీవీ సింధు ఢిల్లీలో దిగగానే ఘన స్వాగతాన్ని దక్కించుకుంది. కేంద్రమంత్రులు, అధికారులు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కదిలి వచ్చి మరీ స్వాగతం పలికారు. కాంస్యం గెలిచినందుకే సింధుకు ఇంతటి ప్రతిష్ట దక్కింది.

    ఇక స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా వస్తే ఇంతటి ఘనత దక్కుతుందో లేదో కూడా తెలియదు. అయితే తనకు వచ్చిన ఫేమ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న కార్పొరేట్ కంపెనీలకు షాకిస్తూ రూ.5 కోట్లు కట్టాలని పీవీ సింధు తాజాగా ఒక్కో కంపెనీకి నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.

    ప్రస్తుతం పీవీ సింధు ‘బేస్ లైన్ వెంచర్స్’కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ప్రమోట్ చేస్తోంది. దానికి కాకుండా వేరే వాళ్లు ఆమె పేరు, ఫొటో వాడడానికి వీల్లేదు . అయితే నిబంధనలకు విరుద్ధంగా తన బ్రాండ్ పేరు వాడినందుకు హ్యాపీడెంట్, పాన్ బహార్, యురేకా ఫోర్బ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, వోడాఫోన్ ఐడియా, ఎంజి మోటార్, యుసిఒ బ్యాంక్, పిఎన్‌బి, ఎస్‌బిఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు నోటీసులు పంపుతున్నట్లు ధృవీకరించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, విప్రో లైటింగ్ బ్రాండ్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపింది.

    తన అనుమతి లేకుండా ప్రకటనలలో తన పేరు, ఫొటోలను అనైతికంగా ఉపయోగించుకున్నందుకు గాను 15 కంపెనీలకు లీగల్ నోటీసులు పంపింది. ఒక్కొక్కరు రూ.5 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.

    ఇలా ఆటలోనే కాదు.. బయట వ్యవహారాల్లోనూ తన పేరును ‘క్యాష్’ చేసుకోవడంలో పీవీ సింధును మించిన వారు లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి.