https://oktelugu.com/

స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

తమిళ స్టార్ హీరో వారసుల్లో ఇప్పటివరకూ ఫుల్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోగలిగిన వాళ్లలో ఎవరైనా ఉన్నారా అంటే.. అది కచ్చితంగా చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’నే. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి‘ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగానే క్లిక్ అయ్యాడు. ఇక ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో, తన […]

Written By:
  • admin
  • , Updated On : August 9, 2020 / 07:19 PM IST
    Follow us on


    తమిళ స్టార్ హీరో వారసుల్లో ఇప్పటివరకూ ఫుల్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోగలిగిన వాళ్లలో ఎవరైనా ఉన్నారా అంటే.. అది కచ్చితంగా చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’నే. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి‘ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగానే క్లిక్ అయ్యాడు. ఇక ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో, తన తరువాత సినిమాని మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేసుకున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ను తీసుకుంటున్నారట.

    Also Read: ముదురు హీరోయిన్ తో రవితేజ రొమాన్స్ !

    సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ఈ యంగ్ బ్యూటీకి, ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు, నిజానికి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా, ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. దాంతో ఆమెకు ఆఫర్లు దూరమైపోయాయి. అయితే తొందరగానే జ్ఞానోదయం తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ, ఆ తరువాత మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వండి అని అందర్నీ పోన్ చేసి మరి అడగడం మొదలుపెట్టిందట. మరి ఈ క్రమంలో విక్రమ్ కుమారుడికి కూడా ఫోన్ వెళ్లడం.. కుర్రాడు అమ్మాయి అడిగేసరికి కాదనలేకపోవడం.. మొత్తానికి సోషల్ మీడియా బ్యూటీకి ఛాన్స్ వచ్చేసింది. ఏదైతే ధృవ్ ను పట్టుకుని ఛాన్స్ కొట్టింది.

    Also Read: ఎన్టీఆర్ ప్రేమ కోసం చనిపోతుందట !

    అన్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ కి నితిన్ – యేలేటి చేయబోయే కొత్త సినిమాలో రెండో కథానాయకిగా ఛాన్స్ వచ్చింది. అలాగే నాగశౌర్య హీరోగా రాబోయే ఓ సినిమాలో కూడా ఈ భామకు హీరోయిన్ ఛాన్స్ ఉంది. మరి ఈ అమ్మడు తన నుండి రాబోయే భవిష్యత్తు చిత్రాల్లోనైనా తన నటనతో మెప్పించగలిగితే.. అవకాశాలు పెరుగుతాయి. ఇక ధృవ్ ప్రస్తుతం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం తన ఫామ్ హౌస్ లో ఏకాంతంగా గత కొన్ని రోజులు నుండి తన ట్రైనర్ సాయంతో కఠినతరమైన కసరత్తులు చేస్తుకుంటున్నాడు.