మోదీ సంచలనం.. ఓ సామాన్యుడిలా గురుద్వార్ వెళ్లిన ప్రధాని..!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ప్రధాని నరేంద్ర మోదీ మారిపోతున్నారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలన్నింటినీ మోదీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తూ ముందుకెళుతున్న సంగతి తెల్సిందే..! Also Read: కేంద్రం వర్సెస్‌ రైతు సంఘాలు దేశ రక్షణ విషయంలో.. అభివృద్ధి విషయంలో మోదీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేసింది లేదు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలను తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే […]

Written By: Neelambaram, Updated On : December 20, 2020 4:58 pm
Follow us on


సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ప్రధాని నరేంద్ర మోదీ మారిపోతున్నారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలన్నింటినీ మోదీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తూ ముందుకెళుతున్న సంగతి తెల్సిందే..!

Also Read: కేంద్రం వర్సెస్‌ రైతు సంఘాలు

దేశ రక్షణ విషయంలో.. అభివృద్ధి విషయంలో మోదీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేసింది లేదు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలను తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే తాజాగా మోదీ మరో సంచలనాన్ని సృష్టించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గురుద్వార్ వెళ్లి సిక్కుల ఆరాధ్య దైవమైన తేగ్ బహదూర్ ను దర్శించుకొని ఘనంగా నివాళ్లర్పించడం ఆసక్తికరంగా మారింది.

ఆదివారం ఉదయం ఢిల్లీలోని రకాబగంజ్ గురుద్వారాకు మోదీ ఆకస్మికంగా వెళ్లారు. అయితే ప్రధాని గురుద్వారాకు వెళ్లే వరకూ సంబంధిత సిబ్బందికి సమాచారం లేకపోవడంతో ఎలాంటి ఏర్పాట్లుగానీ.. ప్రత్యేక పోలీసు బందోబస్తు చేయలేదని తెలుస్తోంది.

Also Read: కొత్త సచివాలయం.. కేసీఆర్ మళ్లీ మార్చాడు

ప్రధాని వెళ్లే మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయలేదు. ఇక ఉదయాన్నే మంచుకురుస్తుండగా ఒక సామాన్య వ్యక్తిలా మోదీ గురుద్వారా చేరుకొని తేగ్ బహదూర్ సింగ్ ను దర్శించుకున్నారు. అనంతరం ఆయన సేవలను మోదీ కొనియాడారు.

గురు తేగ్ బహదూర్ సింగ్ జీవితం ఎంతో ఆదర్శనీయని.. ఆయన ధైర్యం.. తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశంలోని ప్రధానమైన గురుద్వారాల్లో ఒకటైన రకాబ్‌గంజ్ గురుద్వారాను ప్రధాని ఆకస్మికంగా దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్