వివాదాస్పదం అవుతున్న టీటీడీ నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు కేరాఫ్‌ అవుతోంది. అదేంటో.. టీటీడీ అవలంబిస్తున్న, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదస్పదం అవుతున్నాయి. తాజాగా.. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయంలో భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సర్వదర్శనం టిక్కెట్లు ముందుగానే జారీ చేయడంపై తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. డిసెంబరు 24న దర్శనం టోకెన్లు ముందస్తుగా ఇవ్వడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలని […]

Written By: Srinivas, Updated On : December 20, 2020 3:49 pm
Follow us on


తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు కేరాఫ్‌ అవుతోంది. అదేంటో.. టీటీడీ అవలంబిస్తున్న, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదస్పదం అవుతున్నాయి. తాజాగా.. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయంలో భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సర్వదర్శనం టిక్కెట్లు ముందుగానే జారీ చేయడంపై తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. డిసెంబరు 24న దర్శనం టోకెన్లు ముందస్తుగా ఇవ్వడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలని టీటీడీ అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: కేసీఆర్ ను ఓవర్ టేక్ చేస్తున్న జగన్

డిసెంబరు 20న వస్తే స్వామి వారి దర్శనానికి వస్తే 24కి టిక్కెట్లు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఇదేంటని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులతో ఎక్కడుండాలని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను తరిమినట్టు భక్తులను తరుముతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆందోళనపై టీటీడీ స్పందించింది. రోజువారీ కోటా పరిమితి దాటడంతో 24వ తేదీ టోకెన్లు ఇస్తున్నామని పేర్కొంది. డిసెంబరు 21, 22, 23 తేదీల సర్వ దర్శనం టోకెన్లను ముందుగానే జారీ చేసినట్లు వివరించింది.

భక్తులను వెనక్కి పంపకూడదనే ఉద్దేశంతోనే టోకెన్లు ముందస్తుగా జారీ చేసినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులు నిలదీయడంతో సోమవారానికి అదనంగా మరో 3 వేల టోకెన్లు జారీచేయడంతో పరిస్థితి సద్ధుమణిగింది. కానీ, తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం వద్ద కౌంటర్లలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను మూసివేస్తామని రెండు రోజుల కిందట టీటీడీ ప్రకటించింది.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..?

డిసెంబర్ 22, 23, 24 తేదీలకు సంబంధించిన టోకెన్లను కూడా 21లోపు జారీ చేస్తామని, భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కోవిడ్ నిబంధ‌న‌లు, గ‌తంలో జ‌రిగిన శాంతిభ‌ద్రత‌లు, ఇత‌ర అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప‌ర్యాయం వైకుంఠ ఏకాద‌శి స‌ర్వదర్శనం టోకెన్లు స్థానికుల‌కు మాత్రమే ప‌రిమితం చేశామని టీటీడీ వివరించింది. స్థానికేత‌రులెవరూ టోకెన్ల కోసం రావద్దని సూచించింది. స్థానికులు కూడా ఆధార్ కార్డు తీసుకొని కోవిడ్ రూల్స్‌ పాటిస్తూ నిర్దేశించిన 5 ప్రాంతాలకు వచ్చి టోకెన్లు పొందాలని తెలిపింది. అయితే దీనిపై కూడా భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్