దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. కొన్ని నెలలపాటు లాక్డౌన్ కొనసాగడంతో పేద.. మధ్యతరగతి.. వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారో కళ్లారా చూశాం..!
Also Read: గ్రేటర్లో మళ్లీ ఎన్నికలు.. అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం..!
లాక్డౌన్ ఎఫెక్ట్ తో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో కేంద్రం తిరిగి ఆన్ లాక్ ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆన్ లాక్ కొనసాగుతోంది. దీంతో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే కరోనా దెబ్బకు కుదేలైన కొన్నిరంగాలు మాత్రం ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదు. ముఖ్యంగా సినిమా.. థియేటర్లు.. విద్యారంగంపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడినట్లు కన్పిస్తోంది.
కొన్నినెలలుగా విద్యారంగం మూతపడటంతో ఈరంగంపై ఆధారపడి జీవిస్తున్న ప్రైవేట్ టీచర్లు.. లెక్చరర్లు.. ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: జమిలిపై బీజేపీ దూకుడు
ఈక్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ ఎదుట టెక్నికల్ కాలేజీల ఎంప్లాయిస్ ఆందోళనకు దిగింది. కరోనా సాకుతో ప్రైవేటు కాలేజీలు తమకు జీతాలు ఇవ్వడం లేదని.. యజమాన్యాలు జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని నినదించారు.
అయితే కొందరు ప్రగతి భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అడ్డుకోనే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం.. తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్