https://oktelugu.com/

‘మారుతి – రవితేజ’ సినిమాకి క్రేజీ టైటిల్ !

కమర్షియల్ డైరెక్టర్ గా మారుతికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేసి, మంచి కలెక్షన్స్ ను రాబట్టడంలో మారుతి దిట్ట. ఏది ఏమైనా మారుతి స్టైలే వేరు. ఇక ఆయన లాస్ట్ సినిమా ‘ప్రతిరోజు పండుగే’ సూపర్ సక్సెస్ తరువాత మారుతి సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మారుతి మాత్రం ఇప్పటివరకూ తన కొత్త సినిమా స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడు. అయితే, మారుతి – నాని కలయికలో వచ్చిన […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 03:53 PM IST
    Follow us on


    కమర్షియల్ డైరెక్టర్ గా మారుతికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు చేసి, మంచి కలెక్షన్స్ ను రాబట్టడంలో మారుతి దిట్ట. ఏది ఏమైనా మారుతి స్టైలే వేరు. ఇక ఆయన లాస్ట్ సినిమా ‘ప్రతిరోజు పండుగే’ సూపర్ సక్సెస్ తరువాత మారుతి సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మారుతి మాత్రం ఇప్పటివరకూ తన కొత్త సినిమా స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడు. అయితే, మారుతి – నాని కలయికలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా సూపర్ సక్సెస్ కావడం.. పైగా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి.

    Also Read: గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్! ఎప్పుడో తెలుసా?

    కానీ తన కొత్త ప్రాజెక్ట్ కోసం మాస్ మహారాజా రవితేజతో కలిసి పని చేయడానికి మారుతి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ‘పక్కా మాస్’గా ఫిక్స్ చేసారని సమాచారం. ఏది ఏమైనా మారుతి ఎలాంటి సినిమా చేస్తాడా ? ఏ హీరోతో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణంలో.. రవితేజతో సినిమా ఫిక్స్ అని వార్తలు రావడంతో దానికి తగ్గట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా ఇదే న్యూస్ వైరల్ అవుతుండటంతో దాదాపు ఈ సినిమా ఫిక్స్ అని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు. నిజానికి ఈ చిత్రం గురించి ఆ మధ్యే వార్తలు వచ్చాయి.

    Also Read: ఎన్టీఆర్ షూ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

    కానీ ఆ తరువాత రవితేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని కూడా మళ్ళీ వార్తలు వచ్చాయి. దాంతో ‘మారుతి – నాని’ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఉన్నట్టు ఉండి రవితేజ – మారుతి సినిమా మళ్ళీ లైన్ లోకి వచ్చింది. పైగా టైటిల్ ను కూడా ఖాయం చేసారు. ఈ సినిమా మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అన్నట్టు రవితేజతో సినిమా తరువాత మారుతి వెంకటేష్ తో సినిమా చేస్తాడని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్