https://oktelugu.com/

రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..?

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఆర్​సీటీసీ ఇకపై వెబ్ సైట్, యాప్ లో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణికులు రిఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే రిఫండ్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం రైలు ప్రయాణికులు ఐఆర్​సీటీసీ-ఐపే ద్వారా రద్దు చేసిన వెంటనే రీఫండ్ పొందవచ్చు. 2019 సంవత్సరంలో కేంద్రం ఐపేను ప్రారంభించిన సంగతి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 20, 2021 / 06:00 PM IST
    Follow us on

    రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఆర్​సీటీసీ ఇకపై వెబ్ సైట్, యాప్ లో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణికులు రిఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే రిఫండ్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం రైలు ప్రయాణికులు ఐఆర్​సీటీసీ-ఐపే ద్వారా రద్దు చేసిన వెంటనే రీఫండ్ పొందవచ్చు.

    2019 సంవత్సరంలో కేంద్రం ఐపేను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా కేంద్రం ఐపేను ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులు రీఫండ్ వెంటనే పొందే విధంగా ఐఆర్​సీటీసీ వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేసినట్టు తెలుస్తోంది. పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఐఆర్​సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసిందని ఐఆర్​సీటీసీ అధికార ప్రతినిధి తెలిపారు.

    యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేయడం వల్ల ఇకపై ప్రయాణికులు తక్కువ సమయంలోనే టికెట్లను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుంది. యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ కావడం వల్ల ప్రయాణికులు తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమయ్యేలా ఏర్పాట్లు జరిగాయి.

    ఐఆర్​సీటీసీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐఆర్​సీటీసీ త్వరలో మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రయాణికులకు అందుబాటులో తీసుకురానుందని తెలుస్తోంది.