దేశంలో నిరుద్యోగుల సంఖ్య, నిరుద్యోగుల శాతం క్రమంగా పెరుగుతోంది. నిరుద్యోగులకు కేంద్రం ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించకపోయినా పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవడం ద్వారా కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ ల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. మోదీ సర్కార్ దేశంలో జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కాగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దేశంలో ఏకంగా 10,000 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కువ ధరకే మోదీ సర్కార్ జన్ ఔషధి కేంద్రాల ద్వారా మెడిసిన్స్ ను అందించడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు కేంద్ర ప్రభుత్వం సహాయంతో జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయవచ్చు.
ఎవరైతే కొత్తగా జన్ ఔషధి కేంద్రంను ప్రారంభిస్తారో వారికి కేంద్రం నుంచి 5 లక్షల రూపాయల వరకు రాయితీ లభిస్తుంది. కేంద్రం చెప్పిన ప్రాంతంలో జన్ ఔషధి కేంద్రను ఏర్పాటు చేస్తే ఈ రూ.5 లక్షలకు మరో రూ.2 లక్షలు అదనంగా లభిస్తుంది. జన్ ఔషధి కేంద్రాలను తెరిచిన వాళ్లు ఈ కేంద్రాల ద్వారా విక్రయించే మెడిసిన్లపై ఏకంగా 20 శాతం వరకు కమిషన్ పొందే అవకాశం ఉండటం గమనార్హం.
జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయడం ద్వారా ప్రజలకు బయట మెడికల్ షాపులతో పోలిస్తే అతి తక్కువ ధరకే మందులు లభిస్తాయి. 5 వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం ద్వారా సులభంగా జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయవచ్చు. కేంద్రం జన్ ఔషధి కేంద్రాల ద్వారా అమ్మకాలపై ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.