https://oktelugu.com/

‘పుష్ప’లో పైశాచిక ఆనందం.. బన్నీ వల్లే !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మలయాళ లీడింగ్ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఫహద్ తెలుగులో చేస్తోన్న మొదటి సినిమా ‘పుష్ప’. కాగా ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రోల్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. అతనిది ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ అని, ఆటవిక జాతులను హసించి పైశాచిక ఆనందాన్ని పొందుతాడని తెలుస్తోంది. Also Read: బట్టలన్నీ […]

Written By:
  • admin
  • , Updated On : March 22, 2021 / 05:04 PM IST
    Follow us on

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మలయాళ లీడింగ్ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఫహద్ తెలుగులో చేస్తోన్న మొదటి సినిమా ‘పుష్ప’. కాగా ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రోల్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. అతనిది ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ అని, ఆటవిక జాతులను హసించి పైశాచిక ఆనందాన్ని పొందుతాడని తెలుస్తోంది.

    Also Read: బట్టలన్నీ విప్పమన్న దర్శకుడు ఎవరో ?

    విలన్ గా నటించేందుకు ఫహద్ ఒప్పుకున్నాడని టాక్. అయితే మన దేశంలో ఇప్పుడు అద్భుతమైన సినిమాలు చేస్తున్న అతికొద్దిమంది హీరోల్లో ఫహద్ ఫాజిల్ మొదటి ప్లేస్ లో ఉంటాడు. మరి అలాంటి హీరో పుష్ప సినిమాలో చేస్తున్నాడు అనగానే అందరికీ ఆ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఫహద్ కి స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాడు. పైగా తన పాత్రనే ముఖ్యం అనుకునే నటుడు. అందుకే మలయాళ చిత్రసీమలో ఇప్పుడు డిఫరెంట్ సూపర్ స్టార్ గా ఫహద్ నిలబడ్డాడు అంటే.. అది అతని సినిమాల సెలెక్షనే కారణం.

    ఇంతకు అతను పుష్ప కోసం అందుకుంటున్న రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా. 5 కోట్లు అట. మలయాళ సినిమా రంగంలో ఒక పెద్ద హీరో తీసుకునే పారితోషికం అంతే ఉంటుంది. కాకపోతే తెలుగు సినిమాల్లో విలన్ పాత్రకు మాత్రం ఇది చాల పెద్ద మొత్తమే అనుకోవాలి. అయితే .. బన్నీ పట్టుబట్టడం వల్లే అంత భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా మేకర్స్ ముందుకు వచ్చారట. అలాగే ఫహద్ వల్ల తమిళనాడు, కేరళ మార్కెట్ లో వచ్చే బెనిఫిట్ వేరు. ఆ లెక్కన చూస్తే అతను కోట్ చేసిన మొత్తం సబబే అని పుష్ప నిర్మాతలు కూడా, అతను అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు.

    Also Read: 12 సినిమాలు ప్లాప్ లు.. అయినా ఛాన్స్ లు !

    ‘పుష్ప’ సినిమా బడ్జెట్, మార్కెట్ చేసే అమౌంట్ భారీగా ఉంటుంది కాబట్టి.. విలన్ క్యారెక్టర్ కి ఐదు కోట్లు ఇస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. కాగా శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్