https://oktelugu.com/

ప్రభాస్ సరసన దీపిక?

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కనుంది. అత్యంత ప్రతిష్టాత్మంగా వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కనుంది. సైంటిఫిక్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు అశ్విన్ ఇప్పటికే సన్నహాలు మొదలెట్టారు. ప్రభాస్ కు జోడీని ఎంపిక చేసేపనిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ యూవీ క్రియేషన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి ‘రాధే’, ‘డియర్’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. […]

Written By: , Updated On : June 1, 2020 / 07:41 PM IST
Follow us on


ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కనుంది. అత్యంత ప్రతిష్టాత్మంగా వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కనుంది. సైంటిఫిక్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు అశ్విన్ ఇప్పటికే సన్నహాలు మొదలెట్టారు. ప్రభాస్ కు జోడీని ఎంపిక చేసేపనిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ యూవీ క్రియేషన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి ‘రాధే’, ‘డియర్’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా జీగేల్ రాణి పూజా హెగ్డే నటిస్తుంది.

నాగ్అశ్విన్ తెరకెక్కించే మూవీలో ప్రభాస్ జోడీగా అలియాభట్ నటిస్తుందని ప్రచారం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో అలియాభట్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుంది. ప్రభాస్ పక్కన అలియా భట్ బాగుంటుందని రాజమౌళి సూచించారని అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పించింది. దీంతో ప్రభాస్ మూవీలోనూ అలియాభట్ నటిస్తుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా దీపిక పదుకోన్ దర్శకుడు నాగ్అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ మూవీపై స్పందించింది. ఈ మూవీ చాలా బాగుందని.. అందరూ చూడాలని కోరింది. దీంతో ప్రభాస్ కొత్త మూవీలో దీపిక నటించనుందనే వార్తకు బలం చేకూరింది. నాగ్అశ్విన్ ఇటీవల దీపికను కలిసి తన దర్శకత్వ ప్రతిభ తెలుసుకునేందుకు ‘మహానటి’ చూడాలని సూచించారట. ఎలాగూ లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దీపిక ‘మహానటి’ మూవీని తిలకించిందట. ఈ మూవీ నచ్చడంతో ప్రభాస్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన ఇప్పటికే బాలీవుడ్ భామ శద్ధాకపూర్ ‘సాహో’లో నటించి మెప్పింది. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే ప్రభాస్ సరసన నటించేందుకు సిద్ధమవుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.