బయటకు చెప్పినా చెప్పకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబును నాస్తికుడిగానే రాజకీయాల్లో అభివర్ణిస్తాడు. ఎందుకంటే ఆయనకు భక్తి చాలా తక్కువంటారు. ఏదో ప్రభుత్వాధినేతగా ఆలయాలకు వెళుతుంటాడు తప్పితే తెలంగాణ సీఎం కేసీఆర్ లా దానిమీదే ఉండడు. ఎప్పుడూ పాలన, పరుగులు అంటూ రాజకీయమే శ్వాసగా చంద్రబాబు జీవిస్తాడు.
Also Read: 5న ఢిల్లీకి రాహుల్.. పీసీసీపై అయోమయం..!
అయితే తాజాగా విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో దేవతా విగ్రహాల ధ్వంసంపై చంద్రబాబు స్పందించిన తీరు ఏపీ రాజకీయాల్లో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. బీజేపీ ఇప్పటికే రాద్ధాంతం చేసిన ఈ ఇష్యూను చంద్రబాబు అక్కడికి వెళ్లి మరీ నిన్న రచ్చ చేశారు.
అయితే చంద్రబాబు రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు ఆయనే బుక్ అయ్యారంటూ వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. చంద్రబాబు పెద్ద అపచారం చేశాడంటూ తాజాగా బయటపెట్టింది.
చంద్రబాబు తాజాగా రామతీర్థం గుట్టపైకి బూట్లు వేసుకొని ఎక్కడం వివాదాస్పదమైంది. ఆ ఫొటోలను వైరల్ చేసిన వైసీపీ వర్గాలు ఇప్పుడు చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నాడని.. ఆయనకు దేవుడిపై భక్తి లేదంటూ ఆయన బూట్లతో ఆలయంలోకి వెళుతున్న ఫొటోలను చూపించి కడిగిపారేస్తున్నారు. ఆలయాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రెచ్చగొడుతున్నాడని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించాడు.
Also Read: ఆంధ్రలో దేవాలయాలపై దాడుల వెనక మర్మమేంటి?
ఇక వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఆలయాలలోకి చెప్పులు, బూట్లు వేసుకొని వెళ్లడం పెద్ద అపచారం అని.. చంద్రబాబుకు రాజకీయం తప్పితే దేవుడిపై భక్తి లేదని తెలుస్తోందని విమర్శించాడు.
మొత్తం చంద్రబాబు రాజకీయ మైలేజ్ కోసం రామతీర్థం ఘటనను వాడుకోవాలని చూసినా బూట్లతో ఆలయం కొండ ఎక్కి ఇప్పుడు పెద్ద తప్పు చేశాడు. మరి ఈ తప్పును టీడీపీ అధినేత ఎలా కవర్ చేసుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్