‘భారత్ బయోటెక్’ కు అభినందనలు: కేటీఆర్

టీకాల ఉత్పత్తి రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఎండీ క్రుష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్ కు చెందిన డ్రగ్ కంపెనీ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ […]

Written By: Suresh, Updated On : January 3, 2021 1:22 pm
Follow us on

టీకాల ఉత్పత్తి రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఎండీ క్రుష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్ కు చెందిన డ్రగ్ కంపెనీ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆదివారం ఉదయం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా సీరమ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవీషీల్డ్ కు కూడా డీసీజీఐ అనుమతినిచ్చింది.