
తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి ఉమ్మడిగా కార్యచరణ చేపట్టిన సంగతి తెల్సిందే. నాడు ఆ పొలిటికల్ జేఏసీని ప్రొఫెసర్ కోదండరామే నాయకత్వం వహించారు. దీంతో ఆయనకు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక పొలిటికల్ జేఏసీ అవసరం లేకుండా పోయింది. అయితే కిందటి ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమికి మద్దతు ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో మహాకూటమి ఓటమిపాలైంది.
ఇక కిందటి గ్రేటర్ ఎన్నికల్లో కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీ(టీజేఎస్పీ) తరుఫున 24 అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. 24మందికి కేవలం 1691 ఓట్లే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కోదండరాంను పట్టించుకోవడం మానేసింది.
త్వరలోనే రాబోయే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోదండరాం సిద్ధమవుతున్నారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు లభిస్తుందని భావించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ కు హ్యండిచ్చినట్లే కన్పిస్తుంది కాంగ్రెస సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకే మొగ్గుచూపుతుంది. దీంతో కాంగ్రెస్ సపోర్టుకు ఆయనకు లభించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో కోదండరాంతో కలిసి నడిచిన లెఫ్ట్ పార్టీలు ఎన్నికల్లో మాత్రం కలిసి నడిచేలా కన్పించడం లేదు.
ఇప్పటికే లెప్ట్ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారాన్ని మొదలెట్టాయి. దీంతో కాంగ్రెస్.. లెప్ట్ పార్టీల మద్దతు కోదండరామ్ కు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే కోదండరాం ఒంటరిగానే బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కోదండరాం పరిస్థితిని చూసిన వారంతా విద్యార్థులకు పొలికల్ పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ కే రాజకీయ పార్టీలు కొత్త పాఠాలు నెర్పుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కోదండరాం ఒంటరిగా పోటీ చేసి గెలుస్తారో లేదో వేచిచూడాల్సిందే..!