చంద్రబాబు విశ్వసనీయతను ప్రజలు నమ్మడం మానేశారా?

రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది. ప్రతీ ఎన్నికలోనూ ప్రజలు తమ విజ్ఞతతో పాలకులకు అవకాశం కల్పిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబును కాదని జగన్ కు జై కొట్టారు. కేవలం విశ్వసనీయత ఆధారంగా జగన్ కు ఏపీలో బంపర్ మెజార్టీ ఇచ్చినట్లు కన్పిస్తోంది. Also Read: హైకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. ‘పంచాయతీ’కి లైన్ క్లియర్..! జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి […]

Written By: Neelambaram, Updated On : December 9, 2020 10:49 am
Follow us on

chandrababu jagan

రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది. ప్రతీ ఎన్నికలోనూ ప్రజలు తమ విజ్ఞతతో పాలకులకు అవకాశం కల్పిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబును కాదని జగన్ కు జై కొట్టారు. కేవలం విశ్వసనీయత ఆధారంగా జగన్ కు ఏపీలో బంపర్ మెజార్టీ ఇచ్చినట్లు కన్పిస్తోంది.

Also Read: హైకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. ‘పంచాయతీ’కి లైన్ క్లియర్..!

జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి వాగ్దానాలను నెరవేరుస్తాడనే ఒకే ఒక్క కారణంతో ఏపీ ప్రజలు ఆయనను సీఎం చేశారు. జగన్ సైతం ప్రజలు తననపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చందుకే ఆయన తొలి ప్రాధాన్యం ఇస్తున్నాడు. సంక్షేమంతోపాటు అభివృద్ధిని సమపాళ్లలో చేస్తూ ప్రజల మన్నలను చూరగొంటున్నాడు.

జగన్ ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర పాలన గడిచిపోయింది. జగన్ సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎన్నో అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు పరిగణలోకి తీసుకోలేకపోతుండటం గమనార్హం. ఎందుకంటే చంద్రబాబు విశ్వసనీయత లేని నేతగా ప్రజల ముందు నిలుచున్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతుంటారని ప్రజలు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ భజన జనమే ఉంటారని.. ఇతరులు ఏదైనా చెబితే పెద్దగా పట్టించుకోరనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు తనకు అనుకూలంగా చెప్పేవాటినే నమ్ముతుంటారు. దీంతో ఆయన ఏపీ శాశ్వత సీఎంగా ఉంటారని భావించారు. అయితే చంద్రబాబు ఏపీ ప్రజలు కిందటి ఎన్నికల్లో గట్టి షాకిచ్చారు. ఆ షాక్ నుంచి ఆయన ఇప్పటికీ కూడా కోలుకోలేక పోతున్నారనే టాక్ టీడీపీ వర్గాల్లోనే
విన్పిస్తోంది.

Also Read: తెలంగాణలో వైసీపీ పాగా.. సహకరిస్తున్న కేసీఆర్..!

చంద్రబాబు తాను ఇచ్చిన హామీలపై మాటతప్పే మనిషిగా పేరుతెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ.. డ్వాక్రా రుణాల రద్దు.. అమరావతి.. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు వాగ్దానాలను నిలబెట్టుకోలేదు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగా ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు పసుపుకుంకుమను తీసుకొచ్చారు. అయితే అది కూడా చంద్రబాబును ఆదుకోలేకపోయింది.

ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయకుడు సీఎం జగన్ పై ఫేక్ సీఎం.. నేరగాడు అంటూ ఆరోపణలు గుప్పించినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబుపై ప్రజలు ఏనాడో విశ్వాసం కొల్పోయినట్లు కన్పిస్తోంది. దీంతో జగన్ పాలనపై ప్రజలకు తమంతట తమకే విసుగు వస్తే తప్ప బాబువైపు మారే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

అప్పటిదాకా చంద్రబాబు జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదని.. ముందుగా ఆయన ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోనే పనులు చేయాలని పలువురు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా విశ్వసనీయతే ఏపీలోప్రధాన అజెండాగా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరీ చంద్రబాబు నాయుడు తన విశ్వసనీయతను ఎలా నిరూపించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్