https://oktelugu.com/

హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లో మూడోసారి మహేష్ సత్తా

సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా కింగ్ అనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఉన్న ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ హీరోకు తిరుగు లేదని నిరూపిస్తున్నారు. మహేష్ బాబుకి సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రెండ్ చేస్తూ, తమకు సాటి లేదని రుజువు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సోషల్ మీడియా రికార్డ్స్ మహేష్ పేరిట నమోదు కావడం జరిగింది. ఈ ఏడాదికి గాను అత్యధికంగా ట్వీట్ చేయబడిన సినిమా టైటిల్ గా సరిలేరు నీకెవ్వరు రికార్డు నమోదు […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 10:16 AM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా కింగ్ అనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఉన్న ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ హీరోకు తిరుగు లేదని నిరూపిస్తున్నారు. మహేష్ బాబుకి సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రెండ్ చేస్తూ, తమకు సాటి లేదని రుజువు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సోషల్ మీడియా రికార్డ్స్ మహేష్ పేరిట నమోదు కావడం జరిగింది. ఈ ఏడాదికి గాను అత్యధికంగా ట్వీట్ చేయబడిన సినిమా టైటిల్ గా సరిలేరు నీకెవ్వరు రికార్డు నమోదు చేసింది. టాలీవుడ్ నుండి ఈ రికార్డు సరిలేరు నీకెవ్వరు అందుకోవడం జరిగింది. ఈ సినిమాతో మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.

    Also Read: విలక్షణ నటుడు నుండి మళ్లీ ‘బ్లఫ్ మాస్టర్’ ?

    2006లో దర్శకుడు పూరి జగన్నాధ్- మహేష్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ పోకిరి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది. మహేష్ కెరీర్ లోనే ఆల్ టైం హిట్ గా నిలిచిన పోకిరి మూవీ మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. నోస్టాల్జియా యాష్ ట్యాగ్ ట్రెండ్స్ ఈ పోకిరి టైటిల్ ఇండియాలోనే రెండవ ప్లేస్ దక్కించుకుంది. టాలీవుడ్ నుండి మొదటిస్థానంలో ఉన్న పోకిరి నోస్టాల్జియా యాష్ ట్యాగ్, ఇండియా వైడ్ రికార్డు క్రియేట్ చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.

    Also Read: మహేష్ ‘సర్కారు వారి..’ కథ అదే !

    ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తుంది. సర్కారు వారి పాట టైటిల్ సైతం అత్యధికంగా ట్వీట్ చేయబడిన టైటిల్స్ లిస్ట్ లో చేరింది. విడుదలకు ముందే టాలీవుడ్ నుండి అత్యధికంగా ట్వీట్ చేయబడిన టైటిల్ గా సర్కారు వారి పాట నిలిచింది. ఇలా మొత్తంగా మూడు సోషల్ మీడియా రికార్డ్స్ మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా జనవరి నుండి సర్కారు వారి పాట చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్