https://oktelugu.com/

పవన్ కళ్యాణ్-రానా.. పవన్ ఫ్యాన్స్ కు గొప్ప గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గొప్ప గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ టీజర్ తో అభిమానులను ఉర్రూతలూగించిన పవన్ ఇప్పుడు ఏకంగా మరో పెద్ద అనౌన్స్ మెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. Also Read: రామ్ ‘రెడ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ! వకీల్ సాబ్ టీజర్ విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ నటించబోయే మరో రిమేక్ ఓకే అయ్యింది. హీరో దగ్గుబాటి రానాతో పవన్ కళ్యాణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 15, 2021 / 07:53 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గొప్ప గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ టీజర్ తో అభిమానులను ఉర్రూతలూగించిన పవన్ ఇప్పుడు ఏకంగా మరో పెద్ద అనౌన్స్ మెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    Also Read: రామ్ ‘రెడ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

    వకీల్ సాబ్ టీజర్ విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ నటించబోయే మరో రిమేక్ ఓకే అయ్యింది. హీరో దగ్గుబాటి రానాతో పవన్ కళ్యాణ్ కలిసి నటించడానికి ముహూర్తం కుదిరింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యపనమ్ కోషియం’ సినిమాకు రిమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

    ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సూర్యదేవర వంశీకృష్ణ నిర్మిస్తుండగా.. ఏకంగా క్రియేటివ్ దర్శకుడు త్రివిక్రమ్ ‘స్క్రీన్ ప్లే, మాటలు ’ అందిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

    Also Read: పవర్ స్టార్ కే డేట్స్ ఇచ్చేలా లేదు !

    ఈ చిత్రంలో పవన్ తోపాటు రానా కలిసి నటించేందుకు ఓకే చెప్పడం ఇప్పుడు బిగ్ అనౌన్స్ మెంట్ గా మారింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్