https://oktelugu.com/

‘మాళవిక’ను కష్టాల్లో పడేసిన మాస్టర్ !

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ అంటేనే.. అందానికి నిర్వచనంలా ఉంటుంది. దీనికితోడు, సోషల్ మీడియా వేదిక పై ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో వేడెక్కిస్తూ.. మొత్తానికి అందాలతో కనువిందు చేయడంలో తనకు తానే సాటి అనిపించేసుకుంది ఇప్పటికే. అసలు ఆ మాటకొస్తే.. ప్రతిరోజూ హాట్ హాట్ ఫోటోలు అప్డేట్ చేయకుండా నిద్ర కూడా పోదు మాళవిక. అంతలా అందచందాలు ఆరబోతలో ఆరితేరిపోయింది. Also Read: రామ్ ‘రెడ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ! అయినా ఉపయోగం ఏముంది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 15, 2021 / 07:54 PM IST
    Follow us on


    యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ అంటేనే.. అందానికి నిర్వచనంలా ఉంటుంది. దీనికితోడు, సోషల్ మీడియా వేదిక పై ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో వేడెక్కిస్తూ.. మొత్తానికి అందాలతో కనువిందు చేయడంలో తనకు తానే సాటి అనిపించేసుకుంది ఇప్పటికే. అసలు ఆ మాటకొస్తే.. ప్రతిరోజూ హాట్ హాట్ ఫోటోలు అప్డేట్ చేయకుండా నిద్ర కూడా పోదు మాళవిక. అంతలా అందచందాలు ఆరబోతలో ఆరితేరిపోయింది.

    Also Read: రామ్ ‘రెడ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ !

    అయినా ఉపయోగం ఏముంది ? గట్టిగా గుప్పెడు కండ కూడా లేని హీరోయిన్లు రేసులో ముందుకు వెళ్లిపోతుంటే.. అన్నీ ఉండి అవకాశాల కోసం ఇంకా ఆశగా ఎదురుచూస్తూ మిగిలిపోతుంది మాళవిక. బాగా స్పీడ్ గా పెంచినా, గ్లామర్ షోకి నేనే కేరాఫ్ అని మేకర్స్ కి చాటి చెప్పుకుంటున్నా.. ఛాన్స్ లు మాత్రం గొప్పగా ఏమి రావడం లేదు ఆమెకు. నిజానికి విజయ్ వంటి పెద్ద సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టిందంటే.. ఇక ఈ బ్యూటీ రేంజ్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తీరా మాస్టర్ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అలాంటిదేమి జరగకపోగా, మాళవికకు ఆ సినిమా పెద్ద మైనస్ అయిపోయింది.

    Also Read: పవర్ స్టార్ కే డేట్స్ ఇచ్చేలా లేదు !

    ఎందుకంటే మాళవిక “మాస్టర్” సినిమాలో పోషించిన పాత్ర ఆల్మోస్ట్ సైడ్ క్యారెక్టరే. అసలు మూడు గంటల నిడివి ఉన్న ఆ సినిమాలో.. ఆమెకు గట్టిగా పది సీన్స్ కూడా లేవు అంటే.. మాళవిక పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీనికీతోడు మాళవిక ఆ సినిమాలో పూర్తిగా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కనిపించి.. మొత్తానికి ఆంటీలా ఉంది. నటించే స్కోప్ ఉన్న పాత్ర కూడా కాదయ్యే. పోనీ హీరోయిన్ గా రెండు డ్యూయెట్లు అన్నా ఉన్నాయా అంటే.. అదీ లేదు. మొత్తానికి మాళవికను మాస్టర్ కష్టాల్లో పడేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్