https://oktelugu.com/

పవర్ స్టార్ కే డేట్స్ ఇచ్చేలా లేదు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ చేయబోతున్నాడని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా ఈ రీమేక్ చిత్రానికి సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలిశాయి. ఈ సినిమాలో పవన్ భార్యగా సాయి పల్లవిని, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ ను, రానా తండ్రిగా సుముద్రఖని, ఇతర క్యారెక్టర్లలో బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లను ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. పైగా ఇప్పటికే నటీనటులు అందరికీ అడ్వాన్స్ లు కూడా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 15, 2021 / 07:44 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ చేయబోతున్నాడని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా ఈ రీమేక్ చిత్రానికి సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలిశాయి. ఈ సినిమాలో పవన్ భార్యగా సాయి పల్లవిని, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ ను, రానా తండ్రిగా సుముద్రఖని, ఇతర క్యారెక్టర్లలో బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లను ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. పైగా ఇప్పటికే నటీనటులు అందరికీ అడ్వాన్స్ లు కూడా ఇచ్చారట.

    Also Read: ‘బాహుబలి 2’ ‘ఆర్ఆర్ఆర్’ కంటే ‘కేజీఎఫ్ 2’కే.. !

    కాకపోతే ఇక్కడ సమస్య అంతా సాయిపల్లవి దగ్గరే వచ్చిందని.. ఆమె డేట్స్ కావాల్సినప్పుడు అందుబాటులో లేవని.. ఇప్పటికే ఆమె వేరే సినిమాల్లో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితిలో సాయి పల్లవి లేదని టాక్ నడుస్తోంది. మరో పక్క ఈ సినిమా సెట్ మీదకు వెళ్లిపోవడానికి రెడీగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా వర్క్ ను త్వరగా పూర్తి చేయడానికి వరుసగా ఆ సినిమాకి డేట్స్ ఇచ్చాడు. ఆ సినిమా షూట్ అయిపోగానే అయ్యప్పన్ రీమేక్ స్టార్ట్ అవుతుంది.

    ముందుగా హైదరాబాద్ లో మొదటి షెడ్యూలు పూర్తి చేస్తారట. ఆ తరువాత పోలాచ్చిలో ఒక లెంగ్తీ షెడ్యూలులో సినిమా మొత్తాన్ని ఫినిష్ చేస్తారని.. అన్నట్టు త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్ లో ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా అంటూ త్రివిక్రమ్, మరోపక్క పవన్ సినిమా కూడా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ – రానాల కలయిక, పైగా త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక సాగర్ డైరక్షన్ లో ఈ రీమేక్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    Also Read: ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే !

    చేయడానికి సిద్దమయ్యారని, అందులో ప్రముఖ నటుడు రానా కీ రోల్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మోస్ట్లీ వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ఉండొచ్చట. అయితే దర్శకుడే ఇంకా ఫైనల్ కాలేదట. పవన్, రానాల కాంబినేషన్ అంటే పెద్ద దర్శకుడే ఉండాలి. ప్రజెంట్ పెద్ద దర్శకులంతా ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారట. ఒక్కసారి డైరెక్టర్ లాక్ అయితే ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లడమే అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్